గుల్జార్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం | Gulzar to be honoured with Dadasaheb Phalke Award | Sakshi
Sakshi News home page

గుల్జార్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

Published Sat, Apr 12 2014 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

గుల్జార్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

గుల్జార్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

ప్రముఖ సినీ గేయ రచయిత గుల్జార్కు 2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార మరియు  ప్రసార మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. దర్శకుడి, నిర్మాత, రచయిత, కథనం తదితర రంగాలలో భారతీయ సినిమాకు అందించిన సేవలకు గుర్తింపుగా గుల్జార్ను ఆ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది.

 

భారతీయ సినిమా పురోగతికి విశేషమైన సేవలు అందించారని గుల్జార్ను ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కొనియాడింది. 45వ దాదాపాల్కే అవార్డును త్వరలో కేంద్ర ప్రభుత్వం గుల్జార్కు అందజేయనుంది. గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కర్లా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement