Rajinikanth To Receive Dadasaheb Phalke Award - Sakshi
Sakshi News home page

Rajinikanth: దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న సూపర్‌స్టార్‌

Published Mon, Oct 25 2021 12:43 PM | Last Updated on Wed, Oct 27 2021 3:18 PM

Rajinikanth To Receive Dadasaheb Phalke Award - Sakshi

Rajinikanth Receives Dadasaheb Phalke Award : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న విశేష సేవలకు గాను  కేంద్రప్రభుత్వం ఆయన్ని ఈ పురస్కారంతో సత్కరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

కాగా ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్‌ అసురన్‌ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రజనీకాంత్‌, ఆయన అల్లుడు ధనుష్‌ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లేముందు రజనీకాంత్‌ స్థానిక ఫోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు లభించడం సంతోషంగా ఉందని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈ అవార్డును తాను ఊహించలేదన్నారు. ఈ సమయంలో తన గురువు కె.బాలచందర్‌ లేకపోవడం బాధగా ఉందన్నారు. ఇక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. సోమవారం రెండు సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, అందులో ఒకటి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనుండటం, రెండవది కూతురు సౌందర్య రజనీకాంత్‌ విశాకన్‌ హూట్‌ పేరుతో సోషల్‌ మీడియా యాప్‌ ప్రారంభించనుండటం అని పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత
పూరి జగన్నాథ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు : డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement