
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన బెదిరిస్తున్నారని, తివారీ హెచ్చరికలు చూస్తుంటే కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరగుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ చెయ్యలేక హత్య చేయాలనుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్‌పై ఎవరైనా దాడి చేయవచ్చని తివారీ అన్న మాటలకు అర్థమేంటని సిసోడియా ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, పోలీసు కేసు కూడా పెడతామని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
మరోవైపు మనోజ్ తివారీ ఈ ఆరోపణలను ఖండించారు. ఎన్నికల్లో ఆప్ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. ఆప్ నేత సందీప్ భరద్వాజ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన మరణానికి కారణాలేంటో వెలికి తీయాలన్నారు.
చదవండి: గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు..
Comments
Please login to add a commentAdd a comment