రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయలేదు: షిండే
రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయలేదు: షిండే
Published Tue, Dec 10 2013 5:06 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నుంచి తనకు సిఫారసు అందలేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఏ పార్టీకి స్సష్టమైన మెజారిటీ లభించని సంగతి తెలిసిందే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 8 స్తానాలకే పరిమితం కావడంతో తాము పోషించే పాత్ర ఏమి లేదు అని షిండే వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పాలనకు జంగ్ ఎలాంటి సిఫారసులు చేయలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బీజేపీ 31 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రతిపక్ష పాత్ర వహించడానికి మొగ్గు చూపడంతో ఢిల్లీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
Advertisement