‘ఆమ్ ఆద్మీ’పై జంగ్ వెన్నుపోటు యుద్ధం | battle between aap and nazeeb jung | Sakshi
Sakshi News home page

‘ఆమ్ ఆద్మీ’పై జంగ్ వెన్నుపోటు యుద్ధం

Published Mon, Jun 15 2015 1:12 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

‘ఆమ్ ఆద్మీ’పై జంగ్ వెన్నుపోటు యుద్ధం - Sakshi

‘ఆమ్ ఆద్మీ’పై జంగ్ వెన్నుపోటు యుద్ధం

సందర్భం
 
ఈ వైచిత్రిని చూడండి. కేజ్రీ వాల్, గృహ హింస బాధితు రాలైన లిపికా భారతి తర ఫున నిలిచి, ఆమెకు రక్షణ కల్పిం చమని పోలీసులకు విజ్ఞప్తి చేసి ఉన్నా, వారు... బాగానే ఉంది గానీ ముందు మాకు లెఫ్టినెం ట్ గవర్నర్ నుండి ఆదేశాలు రానివ్వండి అనేయగలరు. సీఎం కార్యాలయం నుంచి నేరుగా వచ్చే ఏ వినతిని పోలీసులు అంగీకరించినా దాన్ని నజీబ్ జంగ్ తోసిపుచ్చుతారు. కేజ్రీవాల్, జంగ్‌ల పుణ్యమాని ఢిల్లీలో నేడు నెలకొన్న పరిస్థితి ఇది.

తనకు అలాంటి అధికారాలున్నాయన్న పూర్తి స్పృహ లేనిదే ఏ సీఎం ఏమంత చెప్పుకోదగ్గ ఆత్మ విశ్వాసంతో పాలనా బాధ్యతలను నిర్వహించలేరు. పైన ఎల్లప్పుడూ కాపలా కాసే అధిపతి  ఒకరు లేకుండానే ప్రభుత్వ యంత్రాంగానికి పర్యవేక్షకునిగా సీఎంకు ఏ పదవీ బాధ్యతలకు ఎవరైతే తగినవారనే విషయం తెలుస్తుంది. ఏదో ఒక కుంటిసాకుతోనో లేదా అసలే కారణమూ లేకుండానో జంగ్ రోజువారీ కార్యక్రమంగా ఆశ్చర్య చకితులను చేస్తున్నారు. కార్పొరేట్ కార్యాల యంలోని చిల్లర రాజకీయాలను ప్రయోగిస్తున్నారు.  

జంగ్ తనకు సంక్రమించిన అధికారం కాక మరేమై నా కార ణాలతో అలా ప్రవర్తిస్తున్నారేమోగానీ ఆ విష యాన్ని ఆయన ఎన్నడూ వివరించలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా జంగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేశారు. ఇప్పటిలా అప్పుడు ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో వ్యతిరేకత లేదు. పరిపాలనలోని అన్ని విభాగాలను నియంత్రించలేకపోతున్నందుకు షీలా చిం తించేవారు. సవ్యమైన సమస్యలతోనే ఎవరైనా తన వద్ద కు వచ్చినా, పైన అధిపతినని విశ్వసించే లెఫ్టినెంట్ గవ ర్నర్ ఉండటంతో ఆమె వారిని తిప్పి పంపేసేవారు.

రేప్ కేసులతో కఠినంగా వ్యవహరించాలనే దేశ వ్యాప్త చైతన్యాన్ని తగినంతగా రేకెత్తింపజేసిన సామూ హిక బస్సు రేప్ ఘటన తదుపరి షీలా దీక్షిత్ నిస్సహా యత మరింత తీవ్రమైంది, పైకి సైతం అది కనబడేది. ఆగ్రహంతో జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన ప్రజల వద్దకుపోయి తాను తగు చర్యలను తీసుకోగలనని, తీసు కుంటానని చెప్పడానికి సైతం ఆమె జంకారు.

1991లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని శాసనసభ గల రాష్ట్రంగా మార్చినప్పుడు, ఇలాంటి సున్నితమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్టు లేదనిపిస్తోంది. ఆ పరిస్థితిని మొట్టమొదటిసారిగా సవా లు చేసినది కేజ్రీవాలే. దీక్షిత్‌లాగే ఆమెకు ముందటి బీజేపీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కూడా స్వయంప్రతి పత్తిని వాంఛించారు. సౌత్‌బ్లాక్‌లో ఆయన ధర్నా సైతం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. వర్మ లేదా దీక్షిత్‌ల కు భిన్నంగా కే జ్రీవాల్‌కు స్వార్థ పరశక్తుల ప్రయోజనా లను పరిరక్షించడానికే ఉన్న అధికార యంత్రాంగానికి  లేదా వంక రటింకర వ్యవసకు రుణపడి లేరు. ఆయన ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. ఇప్ప టికైతే ఆయన వెనకడుగు వేసే లేదా తన ఖడ్గాన్ని ఒరలో పెట్టే యోచనలో ఉన్నట్టు కనబడదు. జంగ్‌ను ఆయన కేంద్రం తరఫున కయ్యానికి దిగుతున్న బంటుగానే భావిస్తున్నారు.

ఈ సంక్షోభాన్ని ఒక తిరుగుబాటుదారు అపార్థం గా భావించడం పొరపాటు. అదేమైనా ఉంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన పద్ధతికి సంబంధించినదే కావాలి. వాస్తవానికి దానికి పరిష్కారం అధికార నిర్మా ణానికి సంబంధించిన రాజ్యాంగ సంస్కరణే. అయినా కేజ్రీవాల్  దాన్ని సవాలు చేసే తెలివిని ప్రదర్శించారు. ఆయన మునిసిపాలిటీయే లేని మేయర్‌లాంటి   ముఖ్య మంత్రిగా ఉండాలనుకోవడం లేదు.

తమతమ రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఢిల్లీ గత సీఎంలంతా నిశ్శబ్దంగా ఆయన్ను ప్రశంసిస్తూ ఉండివుంటారు. దీక్షిత్‌లాంటి వాళ్లు, మరో మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ స్వయంప్రతిపత్తి ఆవశ్య కత గురించి మాత్రమే మాట్లాడారు. కేంద్రం మేలుకునే లా చేయలేదు.

అయితే, కేజ్రీవాల్ తప్పుదోవపట్టి ఉంటే ఉండొచ్చే మో గానీ మామూలు రాజకీయవేత్తేమీ కాదు. అది తెలిసి కూడా ఆయనకు  చిర్రెత్తించకుండానే జంగ్ తన విధులను నిర్వర్తింగలిగినా చేయలేదు. గత 49 రోజుల పాలనలో పోలీసుశాఖ కేజ్రీవాల్ నియంత్రణలో లేకు న్నా పోలీసులు లంచాల వసూలు మానేశారని ఢిల్లీ ప్రజలకు తెలుసు. కాబట్టే ఆయనకు తిరిగి అధికారం కట్టబెట్టారు. ఆయనను రెచ్చగొట్టాల్సిన అవసరం జంగ్‌కేమీ లేదు. చట్టంలో రాసి ఉన్నది, రాసి ఉన్న దాని స్ఫూర్తి అనే రెండు అంశాలున్నాయి.

బదిలీల విషయాన్ని ఆయన కెమెరా వెలుగుల ముందుగాక కేజ్రీవాల్‌తో విడిగా మాట్లాడకుండా నిరో ధించిందేమిటి? ఇప్పుడు కేజ్రీవాల్‌పైకి విసురుతున్న నిబంధనలు వేటిలోనూ వారు కోరుకుంటున్న మార్పుల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడకుండా అడ్డుకునేదేదీ లేదు. జంగ్ దెబ్బతీస్తున్నది తాను పరిరక్షించాల్సిన రాజ్యాంగాన్ని కాదు. వాస్తవానికి ఆయన సక్రమంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. గవ ర్నర్ అంటే విశ్వసనీయమైన పర్యవేక్షకుడేగానీ సీఈఓ కాదు. ముఖ్యమంత్రి ఆయన కంటే కిందివాడు కాడు.

బీజేపీ ప్రభుత్వం తరపున పోరాడే బంటులా అనిపించేలా ఆయన ఒక్కసారైనా కనిపించలేదు. కానీ ఆయన సరిగ్గా ఆపార్టీ పాటకు అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. ఢిల్లీలోని నాలుగు మునిసిపల్ కార్పొరేషన్ల కు 2017లో జరగనున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ అనుకుంటోంది. జంగ్, కేజ్రీవాల్ రోజువారీ పరిపాలనా విధులను సైతం నిర్వహించలేని విధంగా నిత్యమూ ఏదో ఒక సంఘర్షణలో తలమునకలై ఉండేట్టు చేస్తున్నారు. ఆయన ప్రవర్తనలోని ప్రతికూలా త్మక స్వభావమే చెప్పాల్సినదంతా చెబుతోంది.

శుక్రవారం రాత్రి దాదాపు అన్ని ప్రధాన టీవీ చానళ్లు హఠాత్తుగా మేల్కొని బీజేపీ అధికారంలో ఉన్న తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో గత 12 రోజు లుగా చెత్తను ఎత్తిపారేయడం లేదని గుర్తించడం కాకతా ళీయమేమీ కాదు. ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందనే సాధారణ సందేశాన్ని అవి పంపాల నుకున్నాయి. కేజ్రీవాల్ పనిచేయడం అసాధ్యం చే యాల నే ఉద్దేశంతో అత్యంత శక్తివంతులైన ఒకరెవరో గానీ అద్భుతమైన ప్రజాసంబంధాలను స్వరపరచడమే ఏక కంఠంతో సాగిన ఆ బృందగానానికి అర్థం.
 
- మహేష్ విజాపుర్కార్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. ఈమెయిల్: mvijapurkar@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement