అసెంబ్లీని రద్దు చేయవద్దు: కేజ్రీవాల్ | Arvind Kejriwal meets Lt Governor Najeeb Jung | Sakshi
Sakshi News home page

అసెంబ్లీని రద్దు చేయవద్దు: కేజ్రీవాల్

Published Wed, May 21 2014 2:50 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

అసెంబ్లీని రద్దు చేయవద్దు: కేజ్రీవాల్ - Sakshi

అసెంబ్లీని రద్దు చేయవద్దు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని వెంటనే రద్దు చేయవద్దని మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కోరారు. తమ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బహిరంగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు  గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశమై తమ పార్టీ చర్చలు సాగిస్తోందని చెప్పారు. తొలుత తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని చెప్పిన ‘ఆప్’, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత వైఖరిని మార్చుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement