త్వరగా అసెంబ్లీని రద్దు చేయండి!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రివాల్ కోరారు. అసెంబ్లీ రద్దు ఆలస్యం కావడం వల్ల శాసన సభ్యులను ప్రలోభాలకు గురిచేయడమే కాకుండా డబ్బు ఎరగా వేస్తున్నారని, తమ శాసన సభ్యులకు బీజేపీ భారీ ఎత్తున డబ్బు ముట్టచెప్పేందుకు ప్రయత్నిస్తోందనే విషయాన్ని జంగ్ దృష్టికి కేజ్రివాల్ తీసుకువచ్చారు.
జంగ్ తో భేటి తర్వాత.. శాసన సభ్యులను లొంగ దీసుకునేందుకు రాజకీయ బేరసారాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దు ఆలస్యం చేయవద్దని జంగ్ కు తెలిపానని కేజ్రివాల్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే తన ప్రశ్నకు జంగ్ వద్ద సరియైన సమాధానం లభించలేదని కేజ్రివాల్ తెలిపారు. గత ఎన్నికల్లో 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.