ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ.. ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని లేదా రాష్ట్రపతి పాలన విధించాలని అరవింద్ కేజ్రీవాల్ చేసిన సిఫార్సులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ తిరస్కరించారు. ఢిల్లీ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచాలని నిర్ణయించారు.
సుప్త చేతనావస్థ అంటే.. ఎమ్మెల్యేలంతా యథాతథంగా అధికారంలో కొనసాగుతారు గానీ, వారికి మాత్రం చట్టాలు చేసే అధికారం ఉండబోదు. రాష్ట్రపతి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాదు, ఏదైనా రాష్ట్ర అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారంటే, ఆ రాష్ట్రానికి సంబంధించిన శాసనాధికారాలను పార్లమెంటు తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అంటే, ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం కూడా ప్రస్తుతం పార్లమెంటు చేతుల్లోకి వెళ్లిపోతుందన్నమాట. ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించే అవకాశం ఉందని కథనాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మనిషిగా పేరుపొందిన నజీబ్ జంగ్, మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
సుప్త చేతనావస్థలో ఢిల్లీ అసెంబ్లీ
Published Sat, Feb 15 2014 4:32 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement