సాంబా: జమ్మూ కాశ్మీర్‌లోని భారత్-పాక్ సరి హద్దుల వద్ద ఈ ఏడాది పెరుగుతున్న చొరబాట్లు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. చొరబాటు యత్నాలు పెరగడం వెనుక లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ హ స్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వద్ద బీఎస్‌ఎఫ్ ఔట్‌పోస్టులపై పాక్ బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో మంగళవారం షిండే భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు.
పాక్‌లో ఉంటున్న సయీద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, వారిని జమ్మూ కాశ్మీర్ వైపు పంపుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని షిండే మీడియాతో చెప్పారు. ఉభయ దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణ ఉల్లంఘన అంశాన్ని తప్పక ప్రస్తావించనున్నట్లు చెప్పారు.
మళ్లీ పాక్ కాల్పులు: సరిహద్దుల వద్ద పరిస్థితిపై షిండే సమీక్ష జరిపి వెళ్లిన కొద్ది గంటలకే పాక్ బలగాలు మంగళవారం రాత్రి ఎల్‌ఓసీ వద్ద మళ్లీ కాల్పులు జరిపాయి. జమ్మూ జిల్లాలోని ఆర్నియా సబ్ సెక్టారు వద్ద రాత్రి భారత స్థావరాలతో పాటు జనావాసాలపైనా మోర్టార్ తూటాలను కురిపించాయి.
చొరబాట్ల వెనుక సయీద్: సుశీల్‌కుమార్ షిండే
Published Wed, Oct 23 2013 4:26 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement