ఉగ్రవాద దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.
జమ్ము కాశ్మర్ రాష్ట్రంలో గురువారం ఉదయం జరిగిన ఉగ్రవాద దాడి గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. పోలీసు స్టేషన్తో పాటు ఆర్మీ క్యాంపుపై కూడా ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలుస్తోందని, ఈ దాడిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా మరణించారని షిండే తెలిపారు.
ఉగ్రవాదుల దాడి విషయాన్ని ఆయన ఖండించారు. సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ప్రధాని మన్మోహన్ సింగ్తో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి దాడి జరగడం దారుణమని షిండే వ్యాఖ్యానించారు.