
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించం: షిండే
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులను నిత్యం గమనిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుపులోకి తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో ఉద్యమం చెలరేగిన నేపథ్యంలో ఆ ప్రాంత కేంద్రమంత్రులు రాజీనామాలను ఆమోదించే ప్రసక్తే లేదని సుశీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా పేర్కొన్నారు.