
శ్రీ విద్యానికేతన్ అందరికీ ఆదర్శం
మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల్లో కేంద్ర మాజీ హోంమంత్రి షిండే
చంద్రగిరి: శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకే ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వార్షి కోత్సవం ప్రముఖ సినీనటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ దేశంలో విద్యావ్యవస్థ పటిష్టం కావాల్సిన అవ సరం ఉందన్నారు. మోహన్‌బాబు విద్యావ్యవస్థను గౌరవించి 25 శాతం పేదలకు ఉచితంగా విద్యను అందించడం ప్రశంసనీయమని అన్నారు. క్రమశిక్షణతో పాటు విద్యార్థుల ఉన్నతికి పునాది వేస్తున్న ఏకైక సంస్థ శ్రీవిద్యానికేతన్ అని తెలిపారు.