కేజ్రీవాల్కు తెలియకుండానే భద్రత: షిండే | Arvind Kejriwal getting security without his knowledge: Sushilkumar Shinde | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు తెలియకుండానే భద్రత: షిండే

Published Fri, Jan 10 2014 4:39 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

కేజ్రీవాల్కు తెలియకుండానే భద్రత: షిండే

కేజ్రీవాల్కు తెలియకుండానే భద్రత: షిండే

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తెలియకుండానే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తెలియకుండానే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. భద్రత వద్దని ఆయన ఎన్నిసార్లు చెప్పినా కల్పించామనే అన్నారు. వీవీఐపీలకు, ప్రమాదంలో ఉన్నవారికి భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, అందుకే హోం మంత్రిత్వశాఖ ఇలా చేస్తోందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు భద్రత ఇవ్వడం మొదలైందని షిండే వివరించారు.

ఇప్పుడు ఆయనకు తెలియకుండానే భద్రత కల్పిస్తున్నామని తన నెలవారీ విలేకరుల సమావేశంలో షిండే చెప్పారు. భద్రతా సంస్థలు మూడుసార్లు కేజ్రీవాల్కు భద్రత కల్పిస్తామని కోరగా, ఆయన ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించారని తెలిపారు. ఢిల్లీ పోలీసులే కేజ్రీవాల్కు భద్రత కల్పిస్తున్నారని, అలాగే ఆయన నివాస ప్రాంతంలోను, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యలయం వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ఘజియాబాద్ ఎస్పీని ఢిల్లీ పోలీసు కమిషనర్ ఆదేశించారని షిండే తెలిపారు. యూనిఫాంలో కాకపోయినా.. మఫ్టీలో అయినా సరే భద్రత కల్పించాల్సిందేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement