అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం: షిండే | gom on telangana to submit report as early as possible says sushilkumar shinde | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 10 2013 1:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

తెలంగాణపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరలో నివేదిక ఇస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన తన నెలవారీ సమీక్ష నివేదికపై గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ తీర్మానాన్ని పంపుతామన్నారు. మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశం కానున్నట్లు షిండే తెలిపారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారా అన్న ప్రశ్నకు షిండే సమాధానం దాటవేశారు. రాష్ట్రాన్ని విభజన నిర్ణయం అమలులో భాగంగా పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement