ప్రత్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా: షిండే | Shinde inaugurates Rs 30 crore BSF base in Solapur | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా: షిండే

Published Wed, Jan 8 2014 11:07 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ప్రత్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా: షిండే - Sakshi

ప్రత్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా: షిండే

షోలాపూర్, న్యూస్‌లైన్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధీమా వ్యక్తం చేశారు. బుధవారం అక్కల్‌కోట్ తాలూకా విహాన్నూర్ గ్రామంలో బీఎస్‌ఎఫ్ భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఏ అభ్యర్థి బరిలోకి దిగినా, విజయాన్ని మాత్రం ఆపలేరని అన్నారు. తప్పకుండా తానే గెలుస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి అభ్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించనని, పార్టీ అప్పగించిన విధిని మాత్రమే నిర్వహిస్తానన్నారు. బీజేపీ తరపున  శరద్‌బన్‌సోడే అయినా, మరొకరు అయినా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని తెలిపారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్‌ఎఫ్ ముఖ్య అధికారులు, హోంశాఖ ఉన్నత అధికారులు, స్థానిక శాసనసభ్యుడు సిద్రామప్ప పాటిల్, మాజీ మంత్రి సిద్దరాం మేత్రేలతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement