BSF troops
-
ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ..
కోల్‌కతా: అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రూ. 2 కోట్ల విలువైన 7 కిలోల 60 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్, 24 పరగణ జిల్లాలోని హకీంపుర ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశ సరిహద్దు దాటుతున్న ఓ వ్యక్తిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న సోనాయి నదిని ఓ తాడు సాయంతో అతడు దాటుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్ సంచిని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారం కనిపించింది. ఆ బంగారం ఏడు కేజీల వరకు ఉంటుందని, దాని విలువ రూ.2కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. -
పఠాన్ కోట్ వద్ద పాక్ బోటు స్వాధీనం
పఠాన్‌కోట్: బెలూన్లు, పావురాలు, బోట్లు ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి భారత్ భూభాగంలోకి, భారత జలాల్లోకి అడుగుపెడుతూ గుబులు రేపుతున్న అంశాలివి. మొన్నటికి మొన్న గుజరాత్ తీరంలోకి దూసుకొచ్చి ఆందోళన సృష్టించిన పాక్ కు చెందిన బోటు ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈసారి మాత్రం పఠాన్ కోట్ ప్రాంతంలో.. అది కూడా ఖాళీ బోటు. పటాన్ కోట్ సెక్టార్ లో రావినది ప్రవాహానికి కొట్టుకొచ్చిన పాక్ కు చెందిన ఓ ఖాళీ బోటును అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ బోటులో ఏమీ లేదని, ఖాళీదని బలగాలు చెప్పాయి. నదిలో ప్రవాహం పెరిగిన కారణంగా ఈ బోటు కొట్టుకొచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నెల(అక్టోబర్ 2)న జాతీయ తీర ప్రాంత గస్తీ దళం గుజరాత్ తీరంలో ఓ బోటును అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిదిమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, వారు మత్య్సకారులని గుర్తించారు. పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిన తర్వాత ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్న విషయం తెలిసిందే. -
కశ్మీర్లో ఉగ్ర కలకలం, కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలతో శుక్రవారం ఉదయం మళ్లీ కాల్పులు జరిగాయి. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) సమీపంలో ఉగ్రకదలికలతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. ఆపరేషన్ కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. గురువారం ఇదే ప్రాంతంలో రెండు చొరబాట్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, కశ్మీర్లో కర్ఫ్యూ 77వ రోజుకు చేరింది. వేర్పాటువాదుల ఆందోళనల నేపథ్యంలో శ్రీనగర్‌లో కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అనంతనాగ్, షోపియాన్, పుల్వామా, కుల్గామ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉన్నాయన్నారు. -
పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో శనివారం పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై కవ్వింపు లేకుండానే భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. బీఎస్ఎఫ్ బలగాలు పాక్ కాల్పులకు దీటుగా బదులు చెప్పాయి. పాక్ జమ్మూ సెక్టార్లో ఈ ఏడాది భారీగా కాల్పులకు దిగడం ఇదే తొలిసారి. గత పక్షం రోజుల్లో కాల్పుల విరమణకు గండికొట్టడం 16వ సారి. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాలకు చెందిన మూడు వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆదివారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతుందని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం జమ్మూలో వెల్లడించారు. బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై పాక్ సైన్యంపైకి కాల్పులు జరుపుతున్నారని చెప్పారు. అయితే గత అర్థరాత్రి నుంచి ఇరువైపులా కాల్పులు హోరాహోరిగా కొనసాగుతున్నాయని తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో మన జవాన్లకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. -
ప్రత్యర్థి ఎవరైనా నేనే గెలుస్తా: షిండే
షోలాపూర్, న్యూస్‌లైన్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ధీమా వ్యక్తం చేశారు. బుధవారం అక్కల్కోట్ తాలూకా విహాన్నూర్ గ్రామంలో బీఎస్ఎఫ్ భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఏ అభ్యర్థి బరిలోకి దిగినా, విజయాన్ని మాత్రం ఆపలేరని అన్నారు. తప్పకుండా తానే గెలుస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి అభ్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించనని, పార్టీ అప్పగించిన విధిని మాత్రమే నిర్వహిస్తానన్నారు. బీజేపీ తరపున శరద్‌బన్‌సోడే అయినా, మరొకరు అయినా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని తెలిపారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ ముఖ్య అధికారులు, హోంశాఖ ఉన్నత అధికారులు, స్థానిక శాసనసభ్యుడు సిద్రామప్ప పాటిల్, మాజీ మంత్రి సిద్దరాం మేత్రేలతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.