ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ.. | a man caught with gold by bsf | Sakshi
Sakshi News home page

ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ..

Published Thu, Jul 20 2017 7:50 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ.. - Sakshi

ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ..

కోల్‌కతా: అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రూ. 2 కోట్ల విలువైన 7 కిలోల 60 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్‌, 24 పరగణ జిల్లాలోని హకీంపుర ప్రాంతంలో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దేశ సరిహద్దు దాటుతున్న ఓ వ్యక్తిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

రెండు దేశాల మధ్య ఉన్న సోనాయి నదిని ఓ తాడు సాయంతో అతడు దాటుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్‌ సంచిని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారం కనిపించింది. ఆ బంగారం ఏడు కేజీల వరకు ఉంటుందని, దాని విలువ రూ.2కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement