కశ్మీర్లో ఉగ్ర కలకలం, కాల్పులు
కశ్మీర్లో ఉగ్ర కలకలం, కాల్పులు
Published Fri, Sep 23 2016 11:27 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలతో శుక్రవారం ఉదయం మళ్లీ కాల్పులు జరిగాయి. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) సమీపంలో ఉగ్రకదలికలతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. ఆపరేషన్ కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. గురువారం ఇదే ప్రాంతంలో రెండు చొరబాట్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, కశ్మీర్లో కర్ఫ్యూ 77వ రోజుకు చేరింది. వేర్పాటువాదుల ఆందోళనల నేపథ్యంలో శ్రీనగర్లో కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అనంతనాగ్, షోపియాన్, పుల్వామా, కుల్గామ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు ఉన్నాయన్నారు.
Advertisement
Advertisement