భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత..
భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత..
Published Mon, Jul 17 2017 11:02 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
జమ్మూ: భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్, బీంబర్ గాలీ సెక్టార్‌లోని భారత నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పులను భారత్ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయని ఢిఫెన్స్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
ఉదయం 7.30 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయని, పాక్ బలగాలు మోటార్లతో కాల్పులు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.
Advertisement
Advertisement