దేశంలో మహిళలకు సముచిత గౌరవం దక్కకపోవడం సిగ్గుచేటని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడకుండా మగవాళ్లు దృక్పథం మార్చుకోవాలని సూచించారు. సోమవారం ఆరంభమైన జాతీయ సమైక్య మండలి (ఎన్ఐసీ) సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. మహిళలపై దౌర్జన్యాలను అరికట్టేందుకు తగిన సూచనలు రూపొందించాలని సూచించారు.
'మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగినపుడే ఏ దేశమైనా పురోగతి సాధించగలదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడకుండా అందరూ తప్పనిసరిగా వైఖరి మార్చుకోవాలి' అని ప్రధాని అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. మహిళల్ని గౌరవించకుండా ఏ సమాజం కూడా అభివృద్ధి చెందలేదని చెప్పారు. మహిళల రక్షణకు కోసం ప్రభుత్వం కఠిన చట్టాల్ని రూపొందించిందని తెలిపారు.
మహిళల్ని గౌరవించకపోవడం సిగ్గుచేటు: మన్మోహన్ సింగ్
Published Mon, Sep 23 2013 12:39 PM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement