ఉమెన్‌సెల్ ప్రారంబిస్నున్న ఇంచార్జ్ వీసీ మన్మోహన్‌సింగ్
యూనివర్సిటీ క్యాంపస్: శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ ప్రమోషన్ అండ్ యునైటెడ్ సర్వీస్‌ను ఇన్‌చార్జ్ వీసీ మన్మోహన్‌సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సంస్థ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థినులు, మహిళా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతుందని వీసీ పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఆయన పాస్ స్వచ్ఛంద సంస్థలోని బాలికలకు దుప్పట్లు, యూనిఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంప్ట్రోలర్ వసంతకుమారి, మహిళా హాస్టల్ వార్డెన్ శ్రీలత, విస్తరణ సంచాలకులు శోభామణి పాల్గొన్నారు.
ఈ–గవర్నెన్స్‌పై అవగాహన
శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ–గవర్నెన్స్‌పై ఇన్‌చార్జ్ వీసీ మన్మోహన్ సింగ్ సోమవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ–ఫైలింగ్, సెక్యూరిటీ ఆఫ్ అకడమిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే అంశాలపై ఆయన మాట్లాడారు.