ఈ సమావేశాల్లోనే మూడు కీలక బిల్లులు: షిండే
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. శీతాకాలపు సమావేశాల్లో , తెలంగాణ బిల్లు, జన లోక్ పాల్ బిల్లు, కమ్యూనల్ వాయెలెన్స్ బిల్లులను సభలో ప్రవేశపెడుతామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మూడు బిల్లులపై మాకు స్పష్టత ఉంది. బిల్లులను తీసుకువస్తాం అని మీడియా సమావేశంలో వెల్లడించారు.
జన లోక్ పాల్ బిల్లును లోకసభ లోఆమోదించాం. ఆతర్వాత రాజ్యసభకు పంపితే.. వారు సెలక్ట్ కమిటీకి పంపారు. అయితే బిల్లుకు కొన్నిసవరణలను కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆ బిల్లు రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. జన లోక్ పాల్ బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నోటీసు పంపాం అని షిండే తెలిపారు. కమ్యూనల్ వాయెలెన్స్ బిల్లుపై చర్చలు జరిగాయి.. తీర్మానం పెండింగ్ లో ఉంది అన్నారు.