'ఆయన ఇప్పటికైనా రాజీనామా చేయాలి' | HCU vc apparao should resign, demands sushilkumar shinde | Sakshi
Sakshi News home page

'ఆయన ఇప్పటికైనా రాజీనామా చేయాలి'

Published Mon, Mar 28 2016 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

'ఆయన ఇప్పటికైనా రాజీనామా చేయాలి'

'ఆయన ఇప్పటికైనా రాజీనామా చేయాలి'

హైదరాబాద్: విద్యార్థులను తన పిల్లల్లా చూడాల్సిన హెచ్సీయూ వీసీ అప్పారావు వారిపట్ల వివక్ష చూపారని కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే విమర్శించారు. అప్పారావు ఇప్పటికైనా రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం వీసీ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన షిండే.. రోహిత్ తల్లి రాధికను పరామర్శించారు. హెచ్సీయూలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని, రోహిత్ది ఆత్మహత్య కాదు, సంస్థాగత హత్య అని విద్యార్థులు.. షిండే దృష్టికి తీసుకువచ్చారు. షిండేతో దళిత, యువజన సంఘాల నేతలు భేటీ అయ్యారు.

షిండే మాట్లాడుతూ.. 'రోహిత్ ఆత్మహత్య జరిగిన రోజునే వీసీగా అప్పారావు తప్పుకోవాల్సింది. ఆయనపై అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు?దళితులను అణచివేయాలని కేంద్రం చూస్తోంది. విద్యార్థుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో షిండేతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహారాష్ట్ర ఎంపీ రాజీవ్ సతావ్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement