‘హెచ్‌సీయూ వీసీని తొలగించాలి’ | students demands to remove VC apparao | Sakshi
Sakshi News home page

‘హెచ్‌సీయూ వీసీని తొలగించాలి’

Published Wed, Apr 13 2016 4:08 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

students demands to remove VC apparao

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో అశాంతికి కారణమైన వీసీ పొదిలి అప్పారావును తక్షణమే తొలగించాలని మంగళవారం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం జనరల్ బాడీ సమావేశంలో డిమాండ్ చేసింది. విశ్వవిద్యాలయాన్ని మిలటరీ క్యాంపుగా మార్చిన అప్పారావును వారంతా తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. యూనివర్సిటీలోకి మీడియా, ఇతర మేధావులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రవేశించడం వారి ప్రజాస్వామిక హక్కు అని తెలిపింది. వర్సిటీలో వివక్షకు తావులేకుండా యాజమాన్యం  చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement