వరంగల్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. హన్మకొండలోని డీసీసీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీలో శాంతిభ్రదతలు లేకపోవడం వల్ల విద్యార్థుల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తుతున్నాయని, వీసీ అప్పారావు లాంటి వారు కొందరికి మద్దతు ఇవ్వడం వల్లే యూనివర్సిటీలో గొడవలు చెలరేగుతున్నాయన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు యూనివర్సిటీల్లో కుల రాజకీయాలు నడుపుతున్నాయని, గతంలో ఇలాంటి రాజకీయాల వల్లే నక్సలిజం పుట్టిందన్నారు. మళ్లీ అదే పరిస్థితులు యూనివర్సిటీల్లో నెలకొనే అవకాశాలున్నాయన్నారు. యూనివర్సిటీల్లో శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని, వీసీని రీకాల్ చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖకు సీఎం లేఖ రాయాలని ఆయన సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పీసీసీ కార్యదర్శులు ఈవీ.శ్రీనివాసరావు, కట్ల శ్రీను పాల్గొన్నారు.
వీసీని వెనక్కి పిలవాలన్న వీహెచ్
Published Thu, Mar 24 2016 10:06 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement