కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అణచేస్తాం: షిండే | Shinde threatens to crush electronic media indulging in anti -Cong propaganda | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అణచేస్తాం: షిండే

Published Tue, Feb 25 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అణచేస్తాం:  షిండే

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అణచేస్తాం: షిండే

షోలాపూర్(మహారాష్ట్ర): కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని ఒక వర్గం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తోందని, ఇలాంటి తప్పుడు కథనాలను వెంటనే ఆపకపోతే ఆ వర్గం మీడియాను అణచేస్తామని హెచ్చరించారు. షిండే ఆదివారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న షోలాపూర్‌లో యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘నాలుగు నెలలుగా ఎలక్ట్రానిక్ మీడియాలోని ఓ వర్గం నాకు, కాంగ్రెస్‌కు సంబంధించిన వార్తలకు మసిపూసి మారేడుకాయ చేస్తోంది. మా పార్టీని అనవసరంగా రెచ్చగొడుతోంది. దీన్ని ఆపకపోతే అణచేస్తాం’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement