
విభజనకు చంద్రబాబే లేఖ ఇచ్చారు.. వెళ్లి అడగండి: షిండే
తెలంగాణపై కేంద్ర మంత్రుల బృందం శనివారం ఇక్కడ సమావేశమయ్యే ముందు హై డ్రామా సాగింది. సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే రాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, నారాయణ ఆయనను అడ్డుకున్నారు.
రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు వస్తాయని టీడీపీ ఎంపీలు షిండేకు వివరించారు. షిండే స్పందిస్తూ.. చంద్రబాబే విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని స్పష్టం చేయడంతో వారు షాక్ తిన్నారు. కావాలంటే వెళ్లి చంద్రబాబునే అడగండంటూ చెప్పారు. సీమాంధ్ర సమస్యలను పరిశీలిస్తామని హామి ఇచ్చిన షిండే అక్కడి నుంచి నిష్ర్కమించారు.