
మాటల్లో కోటలు..చేతలు నీటిమూటలు
సాక్షి, రాజమండ్రి :‘వట్టిమాటలు కట్టిపెట్టి, గట్టిమేలు తలపెట్టవోయ్’ అని మహాకవి అంటే.. ‘వట్టిమాటల ఊకదంచి, గట్టిమేలు ఎగ్గొట్టవోయ్’ అంటున్నారు ప్రస్తుత పాలకులు. రైతులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ వాగ్దా నం నుంచి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్న ప్రకటన వరకూ చంద్రబాబు సర్కారు తీరు.. మాటలతో కోటలు కట్టి, చేతల్లో ఇసుక పిచ్చుకగూళ్లు చూపే తంతులా ఉంది. గత పుష్కరాల కన్నా రెట్టింపు యాత్రికులు వస్తారని, కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని మంత్రులు గొప్పలు చెప్పారు. అయితే..
సర్కారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందుకు అనుగుణంగా లేదు. పుష్కరాలకు ఏడాది ముందే ఏర్పాట్లు ప్రారంభించాలన్న డిమాండ్ మేరకు ఈ నెల 8న రాజమండ్రిలో మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించి చేతులు దులుపుకొంది. భారీ ప్రతిపాదనలతో వచ్చిన వివిధ శాఖల అధికారులు తెల్లముఖాలు వేసేలా చేసింది. తాజాగా ఆ ప్రతిపాదనల్లో భారీగా కోత పెట్టి, కుదించి పంపాల్సిందిగా ప్రభుత్వం ఉ భయగోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించడంతో అధికారులు.. తమ శాఖ కు ఎంత వస్తుందో, ఏ పనులు చేయా లో అన్న అయోమయాన్ని ఎదుర్కొం టున్నారు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడి చేయాలా అని నిట్టూరుస్తున్నారు. ‘మేం అడిగినన్ని నిధులు ఇవ్వక్కరలేదు.
ఓ అయిదు కోట్లు ఇస్తే చా లు.. ఘాట్‌ల వద్ద ఏర్పాట్లు చేసి, పు ష్కరాలు అయ్యాయి అనిపించేస్తాం’ ఓ శాఖ ఉన్నతాధికారి ఆవేదనతో అ న్న మాటలివి. ఈ పుష్కరాలు ప్రత్యేకమైనవని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన నిధులిచ్చే విషయంలో వెనుకాడుతోంది. జిల్లావ్యాప్తంగా ర హదారులు ఛిద్రమయ్యాయి. స్నాన ఘట్టాల్లో గత పుష్కరాలకు చేసిన ఏర్పాట్లు శిథిలం అవుతున్నాయి. సుమారు 110 ఘాట్‌లు అవసరం కా గా 60 లోపే అందుబాటులో ఉన్నా యి. మరి పోటెత్తే యాత్రికులకు సదుపాయాలు ఎలా కల్పించాలన్నది అధికారుల ఆవేదన. మరో పక్క దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల ఆదాయాన్ని పుష్కర ఏర్పాట్లకు మళ్లించాలన్న మంత్రుల కమిటీ సూచనలపై కూడా నిరసన వ్యక్తమవుతోంది. ఈ సూచన ఆలయాల నిర్వాహక కమిటీలకు రుచించడం లేదు.
గిరి గీసుకున్న సర్కారు..
పుష్కరాల నిర్వహణకు ఆకాశమే హ ద్దంటూనే ఆర్థిక మంత్రి యనమల ప్ర భుత్వం రూ.వంద కోట్లు కేటాయిస్తుం దని వెల్లడించారు. దీనిని బట్టి ఎం త అవసరం ఉన్నా మరో వంద కోట్లు దాటి రాదని స్పష్టమవుతోంది. ఉభ య గోదావరి జిల్లాలో అధికారులు సుమారు 1100 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.ఒక్క రాజమం డ్రి నగర పాలక సంస్తే రూ. 270 కోట్లు కావాల ని కోరుతోంది. కానీ వీటిలో పది నుం చి 15 శాతం ఇచ్చేందుకు మాత్రమే సర్కారు సుముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతిపాదనలను కుదిం చి పం పాలన్న ప్రభుత్వాదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నీతూకుమారి ఆయా శాఖల అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. ప్రతిపాదించిన పనులు కే వలం పుష్కరాల్లో యాత్రికులకు సదుపాయాలు కల్పించేవే కావాలన్న మంత్రుల కమిటీ సూచనను గుర్తు చేస్తున్నారు. దీంతో పనుల్లో వేటిని ఉం చాలి, వేటిని తొలగించాలనే సందిగ్ధం అధికారులను పీడిస్తోంది.
వారి ఆశలూ అడియాసలే..
‘పుష్కరాలకు భారీగా నిధులు విడుదల అవుతాయి. పనుల్లో పెత్తనం మనదే. పనులు చేయించిన ఘనతా మనకే’ అనుకున్న ఎమ్మెల్యేల ఆశలపై కూడా ప్రభుత్వం నీళ్లు జల్లింది. ఇప్పటికే రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు కనీసం రూ.500 కోట్లయినా వారి ప్రాంతాలకు రాబట్టాలని ఆశించారు. కానీ రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంతం మొత్తం మీద పుష్కరాల నిర్వహణకు రూ.100 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పడంతో వారి ఆశ వేసవి గోదారిలా సన్నగిల్లిపోయింది.