హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బుధవారం మంత్రుల కమిటీ సమావేశమైంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించి సన్నాహాలపై మంత్రుల కమిటీ సమావేశం అయినట్టు తెలిసింది. ఈ సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, చందులాల్, జూపల్లి కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.