సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది. రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన, బొత్స, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి బుగ్గన, సీఎస్ ఉన్నందున మిగిలిన ముగ్గురూ.. ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉండనున్నారు.
చదవండి: గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా
Comments
Please login to add a commentAdd a comment