సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లు, జర్నలిస్టులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం పల్లి సుభాష్ చంద్రబోస్‌ను నియమించింది. సభ్యులుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జోవో జారీ చేసింది. పుజారులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాల్సిందిగా ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment