సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనలు విరమించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మరోసారి విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమణ కోసం ఏపీ ఎన్జీవోలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు ఆయన బుధవారమిక్కడ తెలిపారు. విద్యుత్ సంకోభంపై ముఖ్యమంత్రితో ఈరోజు ఉదయం మాట్లాడినట్లు దిగ్విజయ్ చెప్పారు. అత్యవసర సర్వీసులకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారన్నారు. పార్టీలన్నీ సమ్మతం తెలిపాకే తెలంగాణాపై ముందడుగు వేశామని, ఇప్పడు వైఖరి మార్చుకోవడం తగదన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో మంత్రుల బృందం పర్యటిస్తుందని....సీమాంధ్రుల సమస్యలు మంత్రి వర్గ కమిటీకి తెలియ జేయవచ్చునని అన్నారు. తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పారన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఈరోజు ఉదయం దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు.
Published Wed, Oct 9 2013 12:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
Advertisement