సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలో పెండింగ్‌లో ఉన్న రూ. 511 కోట్ల బిల్లులను పూర్తిగా చెల్లించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. CFMS ప్రకారం చెల్లించడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందన్నారు మంత్రి. టీడీపీ ప్రభుత్వ హయాంలో CFMS విధానం తీసుకొచ్చారన్నారు.
‘స్వచ్ఛంద్ర కార్పోరేషన్ ద్వారా 2 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. పన్నుల విధానంలో సంస్కరణలతో మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగింది. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం పనులు చేపడుతోంది.
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో గత సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ పై చర్చ జరిగింది. జీపీఎస్ విధానంపై ఉద్యోగ సంఘాలకి పవర్ పాయింట్ ద్వారా వివరించాం. పాత పెన్షన్ వల్ల కలిగే నష్టాలు...జిపిఎస్ ఉపయోగాలు వివరించాం. ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నాం. ఈ సమావేశంలో కూడా కీలక అంశాలపై చర్చ జరగనుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment