
మంత్రులు యనమల, నారాయణ, పుల్లారావు, పల్లె, ఉమ, కిషోర్ బాబు
హైదరాబాద్: ఏపి రాజధాని నిర్మాణం నిమిత్తం భూసేకరణ(లాండ్ పూలింగ్) కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గం ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీలో ఆరుగురు మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డిలకు ఈ కమిటీలో స్థానం దక్కింది.
మంత్రి అచ్చెన్నాయుడు పేరును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తికి ఈ కమిటీలో స్థానం లభించలేదు.
**