![Avanthi Srinivas Comments On Chandrababu About CRDA Bill In Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/31/avanthi.jpg.webp?itok=AQ09xXNA)
సాక్షి, విజయవాడ : ఏపీకి మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం శుభపరిణామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై శుక్రవారం విజయవాడలో సాక్షి టీవీతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే ఉదేశ్యం తో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉత్తరాంధ్ర అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఎంతో వెనకబడ్డాయన్నారు. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృది చెందుతుందని పేర్కొన్నారు.
చంద్రబాబుకి గతంలో ఓట్లు వేసిన వారు అమరావతి ప్రజలు ఒక్కరేన లేక 13 జిల్లాల ప్రజలు ఓట్లేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక అమరావతికి పరిమితం అవుతారా లేక 13 జిల్లాలకు అందుబాటులో ఉంటారా అన్నది ఆయనే తేల్చుకుంటే బాగుంటుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలని తాను కోరుకుంటున్నట్లు అవంతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment