CRDA Bill
-
ఈ ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. గుంటూరులో హైకోర్టు ఉందేదని చెప్పారు. ఈ ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని తెలిపారు. అయితే ఇక్కడ కనీస వసతులు లేవని చెప్పారు. కనీస వసతులకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతాయిని సీఎం జగన్ తెలిపారు. చదవండి: AP Assembly Session 2021: త్వరలోనే సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో ముందుకు వస్తాం: సీఎం జగన్ రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగిందని గుర్తుచేశారు. గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయిందని తెలిపారు. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసిందని చెప్పారు. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశామని తెలిపారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు.. వీరందరి ఆశలూ, ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, తమ ప్రభుత్వానికి గడచిన ఈ రెండున్నరేళ్లలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారని సీఎం చెప్పారు. అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారని అన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మన కళ్లతో చూశామని అన్నారు. చదవండి: 3 రాజధానుల ఉపసంహరణ బిల్లుపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తెలిపారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని పేర్కొన్నారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. -
అమరావతి భూ కుంభకోణం: కీలకసాక్షిగా చెరుకూరి శ్రీధర్
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో చెరుకూరి శ్రీధర్ కీలకసాక్షిగా మారుతున్నారు. కాగా ఆదివారం ఏపీ సీఐడీ అధికారులు శ్రీధర్‌ను విచారించగా రెవెన్యూ రికార్డుల మాయంపై వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. '' 2015లో ల్యాండ్ పూలింగ్‌కు ముందే 2014 అక్టోబర్‌లో తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారు. తిరిగి ఒరిజినల్స్‌ను తుళ్లూరు ఎమ్మార్వోకు ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని గుంటూరు కలెక్టరేట్లోనే ఉంచారు. అనంతరం ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వం రాజధాని నగర పరిధిని నిర్ణయించడం కోసం సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్.. గుంటూరు కలెక్టర్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించారు. 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ పథకం ప్రక్రియ పారంభమైంది. అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41ని తీసుకొచ్చారు. మాజీమంత్రి నారాయణ పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది. ఏపీ అసైన్డ్ లాండ్ యాక్ట్ 1977కి విరుద్ధంగా ఉన్న అంశాలను.. మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లా. చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదు. జీవో జారీకి ముందే కొన్ని ప్రతిపాదనలు.. చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణకు తెలిపా.అధికారులు నిర్ణయాధికారులు కాదు.. మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న ఇతర అధికారులు మాత్రమే.. నిర్ణయాలను అమలు చేస్తారని మంత్రి నారాయణ అన్నారు. ఆ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగింది.'' అని తెలిపారు. కాగా విచారణలో కీలక విషయాలు బయటపెట్టడంతో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తుంది. హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. -
సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో విచారణ
-
కీలక బిల్లులపై హైకోర్టులో విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు రేపటి నుంచి రోజువారీ విచారణ కొనసాగించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. మొత్తం 229 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు పేర్కొంది. అందులో భాగంగా మొదట 49 పిటిషన్లను విచారించనున్నారు. మిగిలిన పిటిషన్లను తర్వాత విచారించనున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. -
అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నామని, ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమై ఉండాలనడం ఎంత మాత్రం సరికాదని అందుకే తాము మూడు రాజధానులను ప్రతిపాదించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గుడ్లన్నీ ఒకే బుట్టలో ఉంటే తీవ్రంగా నష్ట పోతామని గతంలో చెన్నై, హైదరాబాద్ నగరాల విషయంలో అదే జరిగిందని ఆయన అన్నారు. అమరావతిలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమేనని, తాను తన మనుషులు భూములు కొన్న చోట అభివృద్ధి చేయాలని చంద్రబాబు చెబితే ఎలాగని జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘హిందూస్థాన్ టైమ్స్’ ఆంగ్ల దినపత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో జగన్ పలు అంశాలపై తన ఆలోచనలను స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై తమకు ఏ మాత్రం ఆసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం బీజేపీకి అంశాల వారీ మద్దతు నిస్తున్నామని ఆయన తేట తెల్లం చేశారు. ఇంటర్యూ పూర్తి వివరాలు.. హిందూస్థాన్ టైమ్స్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్య నిర్వాహక, న్యాయ, శాసన విభాగాలకు మూడు రాజధానులు ఉండాలనే అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. చర్చించుకోవడం సబ్ జ్యుడిస్ అవుతుంది. అయినప్పటికీ మీ ఈ ప్రయత్నం వెనుక పాలనాపరమైన ఉద్దేశ్యం ఏమిటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ : మూడు రాజధానులు అనేది ఒక సామాన్యుడి ఆలోచన. రాజధాని విధుల విభజించాం. విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధులు నిర్వహణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధాని విధులు విభిన్న ప్రాంతాలకు కేటాయించవచ్చునని చెప్పింది. అన్ని విధులూ ఒకే చోట నుంచి ఎందుకు నిర్వహించాలి? చెన్నై, హైదరాబాద్ నగరాల్లో విధులన్నింటినీ కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు సార్లు తీవ్రంగా నష్ట పోయింది. అన్ని గుడ్లూ ఒకే బుట్టలో ఉంటే నష్టపోతారని చరిత్ర చెబుతోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా అదే వైఖరిని ఎందుకు కొనసాగించాలి? ఇది తార్కికమైన, హేతుబద్ధన ఆలోచన కానే కాదు. హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో 1990 ప్రాంతంలో జరిగిన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ విధానమే మళ్లీ గత టీడీపీ పాలనలో అమరావతిలో జరిగింది. సచివాలయం, అసెంబ్లీ లేదా హైకోర్టు అనేవి అభివృద్ధి కాక పోతే ఎందుకంతగా వాటి గురించి పట్టించుకోవాలి. వాటి గురించి మాట్లాడుకోవద్దు. రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్లు కావాలని గత ప్రభుత్వం చెప్పింది. రైతుల నుంచి సేకరించిన, సమీకరించిన (పూలింగ్) 33000 ఎకరాల భూమిలో మెగా భవన నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేని చోట ఒక నగరాన్ని నిర్మించడం కన్నా ఆయన (చంద్రబాబు) 500 ఎకరాల్లో మరొక చోట నిర్మాణానికి ప్రయత్నించి ఉండొచ్చు. (చదవండి : మరో నాలుగు కులాలకు వైఎస్సార్ చేయూత) ప్రశ్న : శివరామకృష్ణన్ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటుకు కేవలం 500 ఎకరాలు సరిపోతే ఆయనకు(చంద్రబాబు) 33000 ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చింది? జగన్ : అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. నాకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మనుషుల బినామీ లావాదేవీలను వెలికి తీసే పనిలో ఉంది. ఆ ప్రాంతంలో స్వప్రయోజనాలను ఆశించి పబ్బం గడుపుకోవాలనే కొందరు వ్యక్తులు పేద రైతుల నుంచి భూములను కొనుగోలు చేశారు. ఆ తరువాతనే రాజధానిని అక్కడ పెడుతున్నట్లు ప్రకటన వెలువబడింది. భూకుంభకోణం చోటు చేసుకుంది. కారు చౌకధరలకు కొనుగోలు చేసిన వారు వేలాది కోట్ల రూపాయల లబ్ది పొందారు. కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడం కోసం గత ప్రభుత్వం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి అనేది ఒకే చోట కాకుండా దానిని వికేంద్రీకరించి రాష్ట్రమంతటికీ విస్తరింప జేస్తే అన్ని చోట్లా సమీప భవిష్యత్తులో గ్రోత్ సెంటర్లుగా విరాజిల్లుతాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఎన్ని పెద్ద నగరాలున్నాయి? లేవే! అయినప్పటికీ ఆ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అనేక ప్రామాణికాల్లో ముందంజలో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి విస్తరింప జేస్తే విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి మరి కొన్ని నగరాలు అభివృద్ధి క్లస్టర్లు ఉంటాయి. పోర్టుల అభివృద్ధి కూడా జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మధ్య కోస్తాలో అగ్రోలాజిస్టిక్ పార్కును కలిగి ఉండొచ్చు, అన్నీ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు వెళతాయి. ప్రశ్న: చంద్రబాబును చులకన చేయడం కోసం అమరావతిని మీరు నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలకు ఏం సమాధానం చెబుతారు? టీడీపీ నేత కూడా మీ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జగన్ : అది పూర్తిగా అర్థరహితం. అమరావతి గురించే మేం ఎందుకు ఆలోచించాలి? యావత్ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలనేది మా అభిమతం. అమరావతిని మేం వదలి వేయం. అక్కడి నుంచి శాసనసభ పని చేస్తుంది. దేశంలో ఏదైనా అంశంపై నిపుణులు ఇది తప్పుడు విధానం అని చెప్పినపుడు ఎందుకు పరిగణించరు? (గౌరవించరు?) మన దేశంలో ఏదైనా ఒక విధానంపై రెఫరెండం చేసే (ప్రజాభిప్రాయ సేకరణ) విధానం లేదు. అందువల్లనే నిపుణులు వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడమే ఇక మిగిలి ఉన్న మార్గం. రెఫరెండమ్ కనుక అమలులో ఉంటే మేం ఆ విధానాన్ని కచ్చితంగా అనుసరించి ఉండేవాళ్లం. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మా విధానానికి ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని మేం పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణపై మేం కనుక రెఫరెండమ్ నిర్వహించి ఉంటే ఆ 29 గ్రామాల్లోని పది వేల మంది రైతులు మినహా యావత్ రాష్ట్ర ప్రజలు మా వెనుక మద్దతుగా నిలబడి ఉండే వారు. ఆ రైతులు కూడా ఎందుకు వ్యతిరేకిస్తారో కారణాలు విస్పష్టం. రెఫరెండమ్‌కు అవకాశం లేదు కనుకనే కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను మేం గౌరవించాం. మేం కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తీసుకున్నాం. ఈ రెండు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. బీసీజీ నివేదిక కూడా తీసుకున్నాం. వాటన్నింటి ఆధారంగా రాష్ట్ర రాజకీయ కార్య నిర్వాహక వర్గం అభివృద్ధి కేంద్రీకరణ కన్నా వికేంద్రీకరణ తరహా అయితే ఎంతో మెరుగ్గా ఉంటుందని ఒక ఆమోదంతో నిర్ణయం తీసుకుంది. మెగా సిటీలనేవి అవాంఛనీయం. వాటికి అన్ని రకాల వనరులు ఎక్కువగా అవసరమవుతాయి, అంతే కాదు ప్రజలకు పెనుభారంగా పరిణమిస్తాయి. అనువైన రీతిలో (ధరలకు) ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వం ప్రధాన పాత్రగా ఉండాలి. అందుకే మేం అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నాం. అన్ని జిల్లాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల, వైద్య కళాశాలల ఏర్పాటుకు పూనుకుంటున్నాం. అంతే కాదు ప్రస్తుతమున్న 13 జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నాం. (చదవండి : ప్రారంభమైన ‘కిసాన్ రైలు’ ) ఇక చంద్రబాబు చేస్తున్న గూఢచర్యం అనే ఆరోపణ పూర్తిగా అర్థ రహితమైంది. ఈ విషయంలో మీ వద్ద ఏమైనా సాక్షాధారాలుంటే ఇవ్వండి అని స్వయంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ప్రతిపక్షాన్ని అడిగారు. వారు ఎలాంటి సాక్ష్యాన్ని చూపలేక పోయారు. అదే మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు మా పార్టీ సీనియర్ నేతల ఫోన్లను ‘ట్యాప్’ చేశారు. ఇందుకు సంబంధించి అధికారిక సాక్ష్యాధారాలను కూడా మేం అప్పట్లో చూపించాం. ప్రశ్న : మీ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబుకు ప్రత్యర్థే. తాను, వైఎస్సార్ ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చామని, ఒకే పార్టీలో స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజారోగ్యానికి హానిని కలిగిస్తూ... ప్రాణాంతకంగా పరిణమించడమే కాక ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాలు ఎదురవుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు ఏకమై పనిచేయాల్సిన అవసరం లేదంటారా? జగన్ : అమరావతిలో తాము పెట్టిన పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలనే ఏకైక ఆలోచనతో వారు (టీడీపీ) ఉండి పోయారు. వారికి ఇతరత్రా ఇక ఎలాంటి ఎజెండా లేదు. గత 15 నెలలుగా అయన (చంద్రబాబు) అమరావతి గురించి తప్ప ఇంక ఏ విషయంపైనా మాట్లాడ్డం లేదు. అసలు అమరావతి అనేది అంత చర్చనీయాంశం కానే కాదు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని మేం అనేక సార్లు చెప్పాం. మీరు , మీ మనుషులు భూములు కొనుగోలు చేశారనే ఒకే కారణంతో ఒకే చోట అభివృద్ధి చేయాలన్న ఆలోచనను మేం పరిగణించ లేం కదా? ఇక ఏ సహకారం గురించి ఆయన (చంద్రబాబు) మాట్లాడుతున్నారు? యావత్ రాష్ట్రం కరోనా మహమ్మారితో సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నపుడు, ఈ ఏడాది మార్చి తరువాత ఆయన ఏపీలో అడుగైనా పెట్టలేదే? ప్రశ్న : మీరు గతంలో ఉండిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళ చేయాలని వచ్చిన డిమాండ్లను మీరెలా చూస్తున్నారు? గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి లేకుండా అది మనగలుగుతుందని భావిస్తున్నారా? జగన్ : చూడండి. మాది ఆంధ్రాలో బలమైన ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో మాకు సంఖ్యాబలం లేదు. మాది లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీ. విభజన వల్ల దారుణంగా ప్రతికూల పరిస్థితుల్లోకి పడిపోయిన (నష్ట పోయిన) ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోవడం వరకే మా పాత్ర పరిమితమై ఉంటుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో మేమున్నాం. అంతే కానీ జాతీయ స్థాయిలో మాకెలాంటి ఆసక్తి లేదు. ప్రశ్న : ఇంతకీ బీజేపీతో మీ సంబంధాల మాటేమిటి? మీరు ఆ పార్టీకి దగ్గరి మిత్రులు అనుకోవాలా? లేక అంశాల వారీ మద్దతు నిస్తున్న పార్టీ అనుకోవాలా? తరచూ మీ పార్టీ పార్లమెంటులో బీజేపీకి మద్దతు నిస్తూ ఉంది కదా? జగన్ : మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానం. అదే దారిలో వెళతాం. ఏం అంశంలోనూ మేం అదే విధంగా వ్యవహరిస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా అనేది సాకారం అవుతుందని మేం విశ్వసిస్తున్నాం. ఇపుడు కాకపోయినా భవిష్యత్‌లో అది నిజమవుతుంది. ఆ విషయంపై మేం పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నాం. బీజేపీకి మేం అంశాల వారీగా మద్దతు నిస్తున్నాం. మా పిసరంత మద్దతు కూడా అన్ని విధాలా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే. ప్రధానంగా మేం విభజన తరువాత నష్ట పోయిన మా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నాం. -
మూడు రాజధానులు: రోజూవారి విచారణ జరపండి
సాక్షి, న్యూఢిల్లీ : పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల కేసును రోజువారీ విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. వేగంగా విచారించి పరిష్కరించాలని సూచించింది. పాలన వీకేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపీప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై బుధవారం సప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో రేపే(గురువారం) విచారణ ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది రాకేష్ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి న్యాయ వ్యవస్థ ఈ విధంగా జోక్యం చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. దీంతో సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొన్నది.రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. హైకోర్టు కర్నూలుకు తరలివెళ్లనుంది. -
మూడు రాజధానుల కేసు మరో బెంచ్‌కు..
ఢిల్లీ : ఏపీకి సంబంధించిన మూడు రాజధానుల అంశం మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఈ కేసుకు సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కాగా ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం జస్టిస్ నారీమన్నా బెంచ్‌కు మూడు రాజధానుల కేసును బదిలీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో రైతుల తరుపున నారిమన్ తండ్రి పాలి నారిమన్ వాదిస్తుండటంతో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణను వేరే బెంచ్‌కు మార్చాలని జస్టిస్ నారిమన్ ఆదేశించారు. దీంతో ఈ కేసు వేరే బెంచ్ కు బదిలీ కానుంది. ఈ నేపథ్యంలో విచారణను మరోసారి వాయిదా వేశారు. కాగా పాలనావికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : రాజధాని రైతులకు ఏ మాత్రం అన్యాయం జరగదు -
ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు సభ్యులుగా నియమితులయ్యారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (3 రాజధానులకు రాజముద్ర) -
ఎంక్వైరీ అంటే చంద్రబాబుకు భయమెందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి శుక్రవారం కీలక ముందడుగు పడింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులను పరిశీలించి.. న్యాయ నిపుణులతో చర్చించి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఈ మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అమరావతిలో శాసన రాజధాని.. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని... కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే ఎప్పటిలాగే ప్రతీ అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని తప్పుబట్టడంతో పాటుగా.. గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగానికి, విభజన చట్టానికి ఇది వ్యతిరేకమంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో చంద్రబాబు గతంలో అనుసరించిన తీరు, విభజన చట్టం అమలులో గత ప్రభుత్వ వైఖరి, రాజ్యంగంలో ఉన్న విషయాల గురించి మేధావులు, న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్న కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం.(3 రాజధానులకు రాజముద్ర) హడావుడిగా పరిగెత్తుకు వచ్చారు కేంద్రం చేసిన చట్టం 6/2014 కి విరుద్ధమని కొంత మంది అంటున్నారు. అందులో ఒక రాజధాని అని ఉంటే.. ఇప్పుడు మూడు రాజధానులు అనడమేంటని వాదిస్తున్నారు. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలని, అటార్నీ జనరల్ సలహా కోసం పంపించాల్సి ఉంటుందని ఇంకో వాదన చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ రాజకీయ దురుద్దేశంతో ఉందని మరి కొంతమంది అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇలాంటి తరుణంలో సెంట్రల్ యాక్టు 6/2014 అంటే విభజన చట్టంలో ఏమి రాసుందో మేధావులు పరిశీలించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సెక్షన్ 5, సెక్షన్ 6 గురించి చెప్పాల్సివస్తే... సెక్షన్ 5 లో యధాతథస్ధితిని విధిస్తూ హైదరాబాద్‌ని పదేళ్లు ఉమ్మడి క్యాపిటల్‌గా ఉంచుదామని అనుకున్న తర్వాత, ఆ విధానాన్ని చంద్రబాబు మట్టికరిపించారు. స్వప్రయోజనాల కోసం పదేళ్లు ఆగకుండా క్యాపిటల్ కట్టకుండానే ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చిన పరిస్థితులు చూశాం. అంటే విధానపరంగా తీసుకున్న నిర్ణయాలను విభేదించిన తీరును గమనించవచ్చు. (శివరామకృష్ణన్, జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు చెప్పిందిదే..) ఆనాడు సహకరించలేదు.. అది చట్టవిరుద్ధం కాదా? ఇక మరో అంశం.. ‘‘మీ కంటూ ఒక కేపిటల్ ఉండాలి, ఉంటుంది’’ అని చెప్పడం సెక్షన్ 5 అభిప్రాయం. ఆ సెక్షన్ 5ను అనుసరించి.. రాజధాని ఎక్కడ ఉండాలనేదానిపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడానికి.. సెక్షన్ 6 లో శివరామకృష్ణన్ కమిటీ గురించి ప్రస్తావించి మార్చి, 2019లో అంటే బిల్లు వచ్చిన మూడు వారాలకే ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి అప్పటి ప్రభుత్వం చూపించిన విధేయత గురించి పెద్దగా చెప్పుకోనక్కరలేదు, ఆ కమిటీ ఎలా చేద్దాం, ఏం చేద్దాం మీరు సమాచారం ఇవ్వండని ప్రభుత్వాన్ని కోరితే.. ఇవ్వని పరిస్థితి. ప్రభుత్వం తమకు సహకరించలేదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అంటే రాజ్యాంగం, సెంట్రల్ చట్టం అని పదే, పదే అని గుండెలు చించుకుని అరిచేవాళ్లు ఆ రాజ్యాంగ పూరితమైన చట్టం కింద అపాయింట్ అయిన కమిటీకి సహకరించలేదని స్పష్టమవుతోంది. అంతేకాదు వీళ్లు రాజకీయ దురుద్దేశంతో రాజధాని ఎక్కడ నిర్మించాలన్న అంశం మీద ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఆ కమిటీ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే, దాన్ని బేఖాతరు చేసి, ఒక లొకేషన్ని డిసైడ్ చేసేసుకుని ఆ విషయాన్ని ఎక్కడా, ఎవరికీ బయటపడకుండా.. కేవలం వాళ్ల బంధు, మిత్ర పరివారానికి మాత్రం చెప్పుకున్నారు. రాజధాని నిర్మాణ అంశాన్ని సొమ్ము చేసుకునేలా ఒక ప్రణాళిక రచించి. నారాయణ కమిటీ అని తూతూ మంత్రంగా ఓ కమిటీ వేశారు. నిజానికి ఆ కమిటీ ఎందుకు వేశారు? సెంట్రల్ యాక్ట్‌కు అది విరుద్ధం కాదా? న్యాయకోవిదులు ఆ రోజు అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఇదంతా ఒక ప్రణాళిక బద్ధంగా దేశంలో ఉన్న సంపదను ఒక వర్గానికో, వారి అస్మదీయులకో, వారి అనునాయులకో ఇద్దామన్న ఒక ప్రణాళికే తప్ప దీంతో ఉపయోగం లేదన్న వారి మాటలను గమనించాలి.(మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..) బంధువులకు దోచిపెట్టడం రాజ్యాంగబద్ధమా? ఇక మూడు రాజధానులు ఎందుకు అన్న వారు ఒకసారి చట్టం పూర్తిగా చదవాలి. సెక్షన్ 5 లో క్యాపిటల్ అని ఉంది. సెక్షన్ 7 గమనించండి. రాజ్యాంగంలో కేపిటల్లో ఏముండాలి, ఎక్కడుండాలి అనేది ఏమీ లేదు. ప్రజా పాలన కోసం, సౌలభ్యం కోసం, ప్రజల అభీష్టం కోసం, ప్రజల సౌకర్యం కోసం పనిచేసే వ్యవస్థలు..., ఒక దగ్గర హైకోర్టు, ఒక దగ్గర లెజిస్లేచర్, ఒక దగ్గర వేరే విషయాలు ఉండటం అనేది ఈ దేశంలో మన రాష్ట్రంలో మొదటిసారి కాదన్నది గమనించాలి. కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఇలాంటి ఉదంతాలు జరగలేదా? అలహాబాద్‌లో యూపీ హైకోర్టు లేదా? అంటే కేపిటల్ అంటే ఈ మూడూ ఒకే చోట అని చంద్రబాబు రాజ్యాంగంలో రాశారా? మీరు దురుద్దేశంతో తీసుకున్న అన్ని నిర్ణయాలను మేం పాటించకపోతే మేం అప్రజాస్వామ్యికంగా పాలించినట్టా? మీ బంధుమిత్ర పరివారానికి దోచిపెట్టడం రాజ్యాంగబద్ధమా? చట్టం ఏం చెప్తుందో ఓసారి గమనిస్తే మంచింది. ఏదైనా ఒక ప్రభుత్వం పూర్వాపరాలు ఆలోచించకుండా, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో, ఒక స్వలాభప్రేరితమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను ప్రజాప్రయోజనాల మేరకు తిరగదోడటం అన్నది రాజ్యాంగంలో, కోర్టులు అనుమతించిన పరిధిలో ఉన్న ఒక విధానం. ఇక్కడ రాజధాని నిర్మాణానికి మన దగ్గర వనరులు లేవు, అది మీరు ఒప్పుకుంటున్నారు. కానీ రాజధాని విషయంలో జరిగిన మోసాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఊక దంపుడు ప్రసంగాలెందుకు? అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంపై విచారణ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు(ప్రైమాఫేస్ మెటీరియల్) పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చేసింది. బినామీలు ఎక్కడెక్కడ కొన్నారు? ఎవరెవరి పేర్లుతో కొన్నారు? ఎవరెవరు ఏయే నిర్ణయాలు తీసుకున్నారు? వాటిని అనుసరించి ఎవరెవరు ఏం చేశారన్నది పబ్లిక్ డొమైన్లో ఉంది! చట్టం బ్యాక్ గ్రాండ్తో ఫార్మర్స్‌కి రాశారని చెప్పారు. ప్రామిసరీ ఎస్టపుల్, లెజిటమేట్ ఎక్సెపెక్టేషన్ అన్నది ఎన్‌ఫోర్సబుల్ రైట్ కాదు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే, ప్రజా ప్రయోజనాల మేరకు దాన్ని అధిగమించే పవర్ గవర్నమెంట్‌కి లెజిస్లేషన్కి, ఎగ్జిక్యూటివ్ డెసిషెన్స్కిన్నూ, ప్రామిసరీ ఎస్టపుల్న్నూ, లెజిటమేట్ ఎక్సెపెక్టేషన్సూ అఫ్లై కాదని చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ చదవకుండా ఊక దంపుడు కొడతామంటే ఎలా...? ధర్మాసనాలు ఏం చెప్పాయంటే... ఒకరికి ఇచ్చిన ప్రామిస్, ఒకరికి ఇచ్చిన క్రియేట్ చేసిన ఒక కాండక్ట్ గనుక ప్రజాప్రయోజనాలతో కూడుకున్నదిగా లేదన్న మెటీరియల్‌ను చూపించి, ఇది ఇలా చేయటం కుదరదు, వనరులు లేవు, ఇది దురుద్దేశంతో కూడుకున్నది అని అంటే దాన్ని సరిదిద్దకపోతే తప్పు అవుతుంది. ప్రజాబలంతో ఎన్నుకున్న ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో చేసిన ఆగడాలను తిరగదోడకపోతే అది ప్రజాతీర్పునకు వ్యతిరేకం అవుతుంది. ఎన్నికలకు ముందు మారుస్తామని చెప్పారా అంటున్నారు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోతుగా వెళ్తే తెలుస్తాయి ఏ డొంకలు ఎక్కడున్నాయని...? అది చూసిన తర్వాత దీంట్లో ప్రజాప్రయోజనం లేదని చెప్పారు. కొంతమందిపై దీని ప్రభావం ఉన్న మాట వాస్తవం. వారిని ఎలా ఆదుకోవాలనేది ప్రభుత్వ బాధ్యత. ఈ విషయంలో గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. వారిని చూసుకుంటామని భరోసా ఇచ్చింది. ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెబుతోంది. వారు ఆలోచించిన మేరకు బాహుబలిలా కాదు ఎంత కుదురుతుందో అంత చేస్తామని చెబుతోంది. అదే రోజు చట్టం.. అదే రోజు జీవోలు.. అంటే? మరో విషయం.. రాజధాని భూముల్లో గతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? రాజ్యాంగం, రాజకీయం, చట్టం అని అన్నప్పుడు చట్టం అన్నది ఎలా చేయబడుతుంది, ఎవరి ప్రయోజనాల కోసం చేయబడుతుందని వాళ్లు మాట్లాడినంతగా మనం ఈ చట్టం వెనుక రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి? వాళ్లందరూ కలిసి ఒక కేపిటల్ నిర్దేశించుకున్న తర్వాత సీఆర్డీఏ చట్టం తీసుకు వచ్చారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంటుని మీరు కన్సెల్ట్ చేసిందీ లేదు? శివరామకృష్ణన్ కమిటీ మీతో సంప్రదింపులు జరిపిందీ లేదు. వాళ్లను మీరు ఖాతరు కూడా చేయలేదు? దీన్ని ‘ఫ్రాడ్ ఆన్ పబ్లిక్ పవర్’ అంటారు. 2014,30 డిసెంబరు.. అదే రోజు చట్టం చేస్తారు, అదే రోజు నాలుగు జీవోలు వస్తాయి. అంటే చట్టం రాకముందే మీరు అడ్మినిస్ట్రేటివ్‌గా క్యాపిటల్ సిటీ అంటే ఎంత ఉండాలి? క్యాపిటల్ రీజియన్ అంటే ఎంత ఉండాలి? దాంట్లో ఎన్నెన్ని మనవాళ్లు బినామీలుగా, ఎక్కడెక్కడ ఎన్ని కొనుక్కోవాలి అన్నది నిర్ధారణ అయిన తర్వాత... ఒక ఫ్రీ డిటర్మంట్ డెసిషన్‌గా.. ఒక చట్టం రూపం దాల్చడానికి పునాది వేశారు. ఏపీ సీఆర్డీయే చట్టం తీసుకువచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంటుకు అనుగుణంగా ఉందా లేక వ్యతిరేకంగా ఉందా లేకపోతే యాక్ట్‌కు ఎలా ఉంది అనుకుంటే దాంట్లో ప్రజాప్రయోజనం ఉంది కాబట్టి దాన్ని మీరు దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారా? ఇప్పుడు మాత్రం ఎందుకలా? ఇప్పుడు యమనల రామకృష్ణుడు ప్రెసిడెంటుకి ఆమోదంకోసం వెళ్లాలంటున్నారు. మీరు చట్టం చేసినప్పుడు, మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవసరంలేని రాష్ట్రపతి ఆమోదం, ఇప్పుడు కావాలా? అంటే మీరు చెప్పింది చంద్రన్న రాజ్యాంగమా... ఇది భారత రాజ్యాంగమా.. మీకు అనువైనవన్నీ మీ రాజ్యాంగంలో రాసుకుని, మీ పార్టీ మేనిఫెస్టోని, అసలు రాజ్యాంగాన్ని ఎలా సరిపోల్చి భాష్యాలు చెబుతారు? సీఆర్డీఏ చట్టం చేసేటప్పుడు ప్రెసిడెన్షియల్ ఎసెంట్ రానప్పుడు, మరి దాన్ని తీసేటప్పుడు ఎందుకు కావాలని అదొక సూటిప్రశ్న? వికేంద్రీకరణ అనేది రాజ్యాంగ బద్దం కాదు అన్నవాళ్లు ఒక్కసారి ఆర్టికల్ 38 చదువుకోవాలి. ఈ ఆర్టికల్ ప్రకారం (రాజ్యాన్ని శాసించేదేమిటంటే).. మీరు, మీ పాలనా విధానాలను అందరికీ చేరువలో ఉంచి, అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ, అందరికీ మంచి చేకూరేలా చేయాలన్నది ‘స్టేట్ షెల్ ఎండీవర్’ అన్నారు. ఆ ఆబ్జెటివ్ని తీసుకొని రావాలని స్టేట్మెంట్ ఆఫ్ అబ్జెక్షన్ రీజన్స్‌లో ఉంది కదా? లోకల్ బాడీస్‌ని క్రియేట్ చేసి, వికేంద్రీకరణ చేయడం అన్నది చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు గవర్నమెంటు తీసుకున్న చర్యల్లో ఒకటి. గ్రామ, వార్డు సచివాలయాల రూపకల్పన జరిగింది అందుకోసమే. కానీ దానిమీద రాద్ధాంతం చేశారు? ఇప్పుడు వార్డు సెక్రటేరియట్స్ ఎలా పనిచేస్తున్నాయన్న విషయాన్ని దేశమంతా కొనియాడుతూ ఉంది. ఈ మోడల్ని దేశంలో అన్ని రాష్ట్రాలు చదవాలంటుంది. దీని ప్రకారం.. వికేంద్రీకరణ అన్నది అమరావతిని తీసేయడానికో, ఉంచటానికో కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టప్రకారం అవలంబించిన ఒక పొలిటికల్ పాలసీ, ఒక అడ్మనిస్ట్రేటివ్ పాలసీ,ఒక ఎగ్జిక్యూటివ్ పాలసీ(ఇన్ ఎకార్డెన్స్ విత్ లా). అది మీకు నచ్చకపోవచ్చు. రాష్ట్రంలోని మొత్తం సంపద, ఆ 33వేల ఎకరాల్లో పెట్టాలన్నది మీ పాలసీ. అది ఎందుకోసం చేశారు? ఎవరి లాభం కోసం చేశారు? ఏ దురుద్దేశంతో చుశారు? సీబిఐకి కేసు వెళ్లింది... కదా వారే చెప్తారు. దీంట్లో ఎవరెవరు భాగస్వాములు, ఎవరు బినామీలు, ఎవరెంతకు కొన్నారన్నది అంతా బయటకు వస్తుంది. గవర్నమెంటు ఆఫ్ ఇండియా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది అంతా పేపర్లలో చదివాం. ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయి ఎంక్వైరీలు జరుగుతుంటే తెలుస్తుంది. చంద్రబాబుకు భయమెందుకు? రైతుల వెనుక దాచుకుంటారెందుకు? సేవింగ్స్ క్లాజెస్ చూశారా? రైతులను మభ్యపెట్టి లక్షకోట్ల రూపాయలు, లక్షా యాభై వేల కోట్ల రూపాయలు మీరు ఎక్కడనుంచి తెస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా కార్యక్రమాలకు ఫండ్ చేయడం కోసం మనం ఒక పాలసీ పెట్టుకుంటే, దాన్ని మీరెట్లా తూలనాడుతారు? రాష్ట్రం బ్యాంక్రప్ట్ అయిందా అని అడుగుతున్నారే, ఈ సీఆర్డీడీయే కేపిటల్ అన్నదే భూములు అమ్ముకుని తద్వారా వచ్చే డబ్బులతో కేపిటల్ కట్టుకుందామని.. ఆ భూములు ఎలా అమ్ముకోవాలన్న దాంట్లో కుంభకోణాలు ఎన్నిఉన్నాయో మనం చూశాం కదా, మనకి తెలిసిన వాళ్లకి రూపాయికి ఎకరా ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంటుకి ఎక్కువ రేటులో లీజుకి ఇస్తాం. మనకి కావాల్సిన వాళ్లకి తక్కువ రేటులో లీజులు ఇస్తాం అంతేనా? ఇవన్నీ లెజిస్లేటివ్ రికార్డ్స్‌లో ఉంది. లెజిస్టేషన్స్ ప్రెజెంట్ చేసేటప్పుడు గౌరవనీయులైన స్పీకరు ఒక ఆదేశం ఇచ్చారు. అయ్యా ముఖ్యమంత్రి గారు దీంట్లో అన్నీ సమూలంగా మీరు విచారణ జరిపించండన్నారు. ఎంక్వైరీ చేయండి అనగానే చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అయ్యో ఈ ఎంక్వైరీ చేయడానికి మీకు పవరే లేదన్నారు. అసలు ఎంక్వైరీలంటే చంద్రబాబునాయుడుకు భయమెందుకు!? -
ప్రజల ఆకాంక్షలకు చట్ట రూపం: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ చట్టం- 2020 గవర్నర్ ఆమోదం ద్వారా చట్టబద్దం అయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ అనేది చారిత్రాత్మక నిర్ణయం. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ చట్టం ఉద్ధేశ్యం. రాజ్యాంగబద్దమైన చర్యల ద్వారా ఈ చట్టం సంపూర్ణంగా వెలువడింది. సీఎం జగన్ పట్టుదల, ప్రయత్నంతోనే ఇది కార్యరూపం దాల్చింది. ప్రజాస్వామ్యవాదులు దీనిని సమర్ధించాలి. ఇది ఆర్టికల్ 38, 39కి లోబడే ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ మూలసూత్రం ప్రపంచం మొత్తం ఆచరిస్తోంది. గొప్ప నగర నిర్మాణాన్ని రాజధానితో ముడిపెట్టి చంద్రబాబు తప్పు చేశారు. (చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్) నేడు ప్రజల ఆకాంక్షలకు చట్ట రూపం వచ్చింది. ఈ చట్టాన్ని తదుపరి దశకు తీసుకువెళ్లాలి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలుకు రాజధానిలో ప్రాధాన్యత ఇస్తే తప్పేంటి. తెలంగాణా తరహా ఉద్యమాలు భవిష్యత్తులో రాకుండా ఈ చట్టం పనిచేస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ, జిల్లాల విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. గ్రామస్థాయిలో సచివాలయాల ద్వారా ద్వారా జరుగుతున్న లబ్ధి ఇప్పటికే ప్రజలు గుర్తించారు. ఇలాంటి చట్టాలు తీసుకురాకుండా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేము. మరోసారి అధికార కేంద్రీకృతం చేసి తప్పులు చేయకూడదు. శివరామకృష్ణ కమిటీ, వరల్డ్ బ్యాంక్ కూడా పరిపాలన వికేంద్రీకరణ చేయమని చెప్పాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఇన్నాళ్లకు తీరింది. వికేంద్రీకరణ బిల్లును ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఈ బిల్లుపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కి లేదు' అంటూ ధర్మాన హితువు పలికారు. (అందరికీ కృతజ్ఞుడిని: విజయసాయి రెడ్డి) -
కుటిల యత్నాలకు చెల్లు
సాక్షి, అమరావతి: అమరావతి రైతులను అడ్డంగా దోచుకుని అక్కడ బినామీ సామ్రాజ్యం నిర్మించుకున్న టీడీపీ ‘అభివృద్ధి – పరిపాలన వికేంద్రీకరణ’, ‘సీఆర్డీఏ రద్దు’ బిల్లులను అడ్డుకునేందుకు విఫలయత్నాలు చేసింది. ప్రజా బలం లేకున్నా సాంకేతిక అంశాలను ఉపయోగించుకుని శాసన మండలి ద్వారా బిల్లులను నిలిపివేయడానికి చంద్రబాబు పన్నిన కుయుక్తులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ► అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని ఆడిన వికృత ›నాటకాలు చూసి రాష్ట్రం విస్తుపోయింది. ► ఈ బిల్లులు మొదటిసారి అసెంబ్లీలో ఆమోదం పొంది మండలి ముందుకు వచ్చినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపాలని చూడడం ద్వారా వికేంద్రీకరణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో చంద్రబాబు స్వయంగా మండలి గ్యాలరీలో కూర్చుని మరీ చైర్మన్‌పై ఒత్తిడి చేశారు. ► రెండోసారీ పలు సాకులతో అడ్డుకునేందుకు యనమల యత్నించారు. ► అమరావతి రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో రాజధానిలో కృత్రిమ ఉద్యమం సృష్టించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నాయకులు దాన్నో ప్రజా ఉద్యమంగా చిత్రీకరించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. ► ఎంత చేసినా ఆ ఉద్యమం 29 గ్రామాలను దాటి బయటకు రాలేకపోయింది. ప్రజల దృష్టిలో డ్రామాగా మిగిలిపోయింది. ► సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో వికేంద్రీకరణపై ఈ ఉద్యమకారులు వేయని నిందలు, చెప్పని అబద్ధాలు లేవు. ► చివరికి చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో కోర్టుల్లో కేసులు వేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయంగా కొందరు టీడీపీ నేతలూ పిటిషన్లు వేశారు. కోర్టులను తప్పుదారి పట్టించేలా రకరకాల చిత్రీకరణలు, దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ► కేంద్రం పరిధిలో లేని అంశాన్ని కేంద్రం పరిధిలో ఉందని భ్రమలు కల్పించేలా చేయడం, వికేంద్రీకరణ రాజ్యాంగ విరుద్ధమని, బిల్లులను గవర్నర్ కాకుండా రాష్ట్రపతి ఆమోదించాలనే అబద్ధాల ద్వారా ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేందుకు చంద్రబాబు, ఆయన పరివారం ఎన్నో రకాల డ్రామాలాడింది. చివరికి పరిపాలన రాజధానిగా ప్రతిపాదించిన విశాఖ నగరంపై విషం చిమ్మేందుకు చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే ఎల్లో మీడియా వెనుకాడలేదు. ► కాకినాడ నుంచి విశాఖ వరకు సముద్ర తీరంలో చీలిక ఉన్నందున విశాఖ రాజధానికి అనువు కాదనే కొత్త వివాదం రేపేందుకు యత్నించి అభాసుపాలయ్యారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తమకు అవసరం లేదని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటైతే రాయలసీమకు ప్రయోజనం దక్కినా ఒప్పుకోబోమని చెబుతూ అమరావతి ఒక్కటే రాజధాని కావాలని, దాని ద్వారా తాము బాగుండాలని చంద్రబాబు నిత్యం కుయుక్తులు పన్నారు. ► కానీ గవర్నర్ ఈ రెండు బిల్లుల్ని ఆమోదించడంతో ఆయన కుయుక్తులన్నీ తల్లకిందులయ్యాయి. -
గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదం
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ వ్యతిరేకమని, విభజన చట్టానికి వ్యతిరేకమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ఆన్లైన్లో మాట్లాడారు. ► ప్రజలు కరోనాతో బాధపడుతున్న పరిస్థితుల్లో చిచ్చు పెట్టారు. ► అమరావతి ఆంధ్రుల కల. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూములిచ్చారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు ఇది. ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అలాంటి రాజధానిని ఛిన్నాభిన్నం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం. అందుకే భూములిచ్చారు. ఆ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించినట్లు కాదా? ► అమరావతి ఇక్కడే ఉంటుందని, ఇంకా ఎక్కువ ఎకరాలు తీసుకోండని మీరు ఆరోజు అసెంబ్లీలో చెప్పారా లేదా? ఈ రోజు మడమ ఎందుకు తిప్పారు? చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవు. ► విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు జేఏసీ కింద పనిచేస్తాం. రైతులకు సంఘీభావంగా పోరాటం చేస్తాం. ► జేఏసీ పిలుపు మేరకు శనివారం నుంచి రాష్ట్రమంతా నిరసనలు తెలుపుతాం. ► ఇప్పటికైనా కళ్లు తెరవాలని ప్రజల్ని కోరుతున్నా. లేదంటే నష్టపోతాం. ► మీ రాజధాని ఏదని అంటే మాకు మూడు రాజధానులున్నాయని చెప్పే పరిస్థితి వస్తుంది. రిఫరెండం పెట్టి ప్రజల అభిప్రాయం తీసుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్లండి. అమరావతి వద్దని రాష్ట్ర ప్రజలందరినీ చెప్పమనండి. నేను మాట్లాడను. ► రేపటి నుంచి కోర్టుకు వెళతాం. ఇందులో చట్టపరమైన, రాజ్యాంగ పరమైన సమస్యలున్నాయి. గవర్నర్ సంతకం పెడితే అది చట్ట వ్యతిరేకం కాకుండాపోతుందా? ఎస్ఈసీ రమేష్ విషయంలో చూశారు. ఇందులోనూ అదే జరుగుతుంది. ► రాజధానిపై జోక్యం చేసుకోబోమని బీజేపీ చెప్పలేదు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెప్పారు. -
పాలన సౌలభ్యం కోసమే మూడు రాజధానులు
సాక్షి, విజయవాడ : ఏపీకి మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం శుభపరిణామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై శుక్రవారం విజయవాడలో సాక్షి టీవీతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే ఉదేశ్యం తో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉత్తరాంధ్ర అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఎంతో వెనకబడ్డాయన్నారు. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృది చెందుతుందని పేర్కొన్నారు. చంద్రబాబుకి గతంలో ఓట్లు వేసిన వారు అమరావతి ప్రజలు ఒక్కరేన లేక 13 జిల్లాల ప్రజలు ఓట్లేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక అమరావతికి పరిమితం అవుతారా లేక 13 జిల్లాలకు అందుబాటులో ఉంటారా అన్నది ఆయనే తేల్చుకుంటే బాగుంటుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలని తాను కోరుకుంటున్నట్లు అవంతి పేర్కొన్నారు. -
'తోక పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి'
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా చివరికి న్యాయమే గెలిచిందని, ఐదుకోట్ల మంది ఆంధ్రుల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆమోద ముద్ర వేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వెల్లంపల్లి శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ.. ఇప్పటికైనా తోక పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని విమర్శించారు. పదమూడు జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. అందరి అభిప్రాయం మేరకే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన కమిటీలు అన్నీ ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నివేదికలు ఇచ్చాయన్నారు.(యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా?) స్వప్రయోజనాల కోసం చంద్రబాబు అండ్ కో అన్నిప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం చేసిందని తెలిపారు.శాసనసభ ఆమోదించిన బిల్లులను వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అడ్డుకోవాలని చూసారని వెల్లడించారు. శాసనమండలిలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని ధ్వజమెత్తారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయంతో నవ్యాంధ్ర ప్రగతికి సోపానాలు పడబోతున్నాయి.. సంక్షేమంతో పోటీగా అభివృద్దిని పరుగులు పెట్టిస్తామని వెల్లంపల్లి తెలిపారు. -
సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ-2014 రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్.. తన ఆమోద ముద్రవేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి. కాగా పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. (ముగ్గురి నోట అదే మాట!) రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. 2019 డిసెంబర్ 20న తన నివేదికన సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. (‘బోస్టన్’ చెప్పిందేంటి?) అనంతరం 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజ ముద్రవేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్‌క్లియర్ అయ్యింది. గవర్నర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గవర్నర్ ముందుకు ‘మూడు రాజధానుల బిల్లులు’
సాక్షి, అమరావతి: ‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపించింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా ఆమోదించినట్టుగా పరిగణిస్తూ గవర్నర్ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపించారు. -
ఇక ఆమోదం పొందినట్లే!
సాక్షి, అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లు కూడా తమ దృష్టిలో శాసనమండలిలో ఆమోదం పొందినట్లేనని మండలిలో అధికార పక్ష నాయకుడు, ఉప ముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ‘14 రోజులు గడిచాయి. సెలక్ట్ కమిటీల ఏర్పాటు పూర్తి కాలేదు. ఇక దానికి చెల్లు చీటి పడినట్లే’నని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులకు ఆమోదించడం, తిరస్కరించడం లేదంటే పరిశీలన పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడం లాంటి మూడు ప్రత్యామ్నాయాలే ఉంటాయని సుభాష్‌చంద్రబోస్ చెప్పారు. ‘ఈనెల 22న బిల్లులను మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేదు, బిల్లులను మండలి తిరస్కరించలేదు. ఈ నేపధ్యంలో మండలిలో బిల్లులు ఆమోదం పొందినట్టే’ అని పేర్కొన్నారు. శాసనసభలో, మండలిలోనూ ఆమోదం పొందిన ఈ బిల్లులను తదుపరి చర్యగా గవర్నర్‌కు పంపే విషయాన్ని అసెంబ్లీ అధికారులు చూసుకుంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. నిబంధనలను పాటించలేదు.. ‘సెలెక్ట్ కమిటీ నియామకంపై ఏ ఒక్క నిబంధనను మండలి చైర్మన్ అనుసరించలేదు. 5(9) (5) నిబంధన ప్రకారం ఏదైనా బిల్లు మండలిలో ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్ కమిటీకి పంపాలని అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఈ రెండు బిల్లుల విషయంలో అది జరగలేదు. మండలి చైర్మన్ నిర్ణయం వెలువరించే సమయంలోనూ తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. అలాంటప్పుడు చైర్మన్ విచక్షణాధికారంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు’ అని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి తమతో భేటీకి ముందే సెలక్ట్ కమిటీ అంశానికి సంబంధించిన ఫైల్‌ను తిప్పి పంపారని ఉమ్మారెడ్డి, సుభాష్ చంద్రబోస్ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, సస్పెండ్ చేస్తామంటూ అసెంబ్లీ కార్యదర్శిని టీడీపీ నేతలే బెదిరిస్తున్నారని చెప్పారు. ఆరు దశల ప్రక్రియ జరగలేదు... బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా మండలి చైర్మన్ దీనిపై మరో ఆరు దశలలో తదుపరి ప్రక్రియ చేపట్టాలని నిబంధనలు పేర్కొంటున్నాయని సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి తెలిపారు. – మొదటి దశగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని తాను తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యమేనా? అని చైర్మన్ సభను అడిగి తెలుసుకోవాల్సి ఉంది. –రెండోదశగా మూజువాణి ఓటుతోనైనా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై సభ అభిప్రాయం తెలుసుకోవాలి. – అలాంటి సమయంలో ఆ నిర్ణయంపై ఎవరైనా ఓటింగ్ కోరితే నిర్వహించాలి. –సెలెక్ట్ కమిటీకి పంపాలని సభలో నిర్ణయం జరిగితే సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారనే అంశాన్ని సభలోనే వెల్లడించాలి. – ఒకవేళ 8 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే పార్టీల వారీగా ఎంతమందితో ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలి. – సభలో వివిధ పార్టీల సభాపక్ష నాయకుల నుంచి ఆయా కమిటీలకు ప్రతిపాదించే సభ్యుల పేర్లను సేకరించాలి. ఆ తరువాత సంబంధిత సభ్యుల నుంచి అంగీకారం తీసుకోవాలి. – మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసే అంశంలో ఇవేమి చేయలేదు. –సెలక్ట్ కమిటీల ఏర్పాటు, సభ్యుల పేర్లను మీడియా ద్వారా ప్రకటించడం సభా హక్కుల ఉల్లంఘనే. – విచక్షణాధికారం ఉందని మండలి చైర్మన్ ఒకరికి ఉరి వేయమని ప్రకటించి అమలు చేయమంటే అధికారులు పాటించాలా? -
ఆ బిల్లులను ఇంకా సెలెక్ట్ కమిటీకి పంపలేదు
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఇంకా సెలెక్ట్ కమిటీకి నివేదించలేదని తేటతెల్లమైంది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న వాదన తప్పని తేలిపోయింది. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇంకా పంపలేదని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ స్వయంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన గురువారం తణుకులో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆ రెండు బిల్లులను ఇంకా సెలెక్ట్ కమిటీకి పంపలేదు. ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం సాధ్యపడదు’’ అని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ శాసనమండలిలోనే నిలిచిపోయినట్టు స్పష్టమైంది. టీడీపీ వాదనలోని డొల్లతనం బట్టబయలైంది. ఆ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి నివేదించిందని టీడీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. ఈ రెండు బిల్లుల విషయంలో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారం, హడావుడిపై నిపుణులు మండిపడుతున్నారు. ‘‘ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాం.. నిర్ణయం వచ్చేందుకు ఇక మూడు నెలలు సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఇంకా పొడిగించే వీలుంది’’ అంటూ చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ప్రజల్ని తప్పుదారి పట్టించే వాదనను తెరపైకి తెచ్చారని వారు విమర్శిస్తున్నారు. శాసన మండలి చైర్మన్ ఇచ్చిన స్పష్టతతో అసలు నిజం బయటికొచ్చిందని, ఇప్పటికైనా ప్రజలను తప్పుదారి పట్టించే యత్నాలను టీడీపీ విడనాడాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ రెండు బిల్లులపై శాసనమండలి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టేనని వారు చెబుతున్నారు. -
ఆ పిటిషన్లను ప్రస్తుతం విచారణకు స్వీకరించలేం
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లను ప్రస్తుత దశలో విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.బిల్లుల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్న వ్యాజ్యాలపై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మండలిలో బుధవారం జరిగిన పరిణామాల గురించి ఆరాతీసింది. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సమాధానమిస్తూ.. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, సెలెక్ట్ కమిటీ నిర్ణయం వెలువరించేంత వరకు వేచిచూడాలని పిటిషనర్లకు స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చలేదని.. వాటిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని వివరించారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ గురించి బిజినెస్ రూల్స్ ఏం చెబుతున్నాయని ధర్మాసనం ప్రశి్నంచింది. సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల గడువు ఉందని రోహత్గీ వివరించగా.. అందుకే అప్పటి వరకు ఆగాలని పిటిషనర్లకు సూచించింది. అవి సాధారణ బిల్లులే.. ద్రవ్య బిల్లులు కాదు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ వాదనలు వినిపిస్తూ.. ఆ రెండు బిల్లులకు గవర్నర్ అనుమతి అవసరమని, అయితే గవర్నర్ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనికి రోహత్గీ అడ్డుతగులుతూ, ఆ బిల్లులు ద్రవ్యబిల్లులు కాదని స్పష్టంగా చెప్పామని, అలాంటప్పుడు ద్రవ్యబిల్లుకు వర్తించే రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. అశోక్‌భాన్ జోక్యం చేసుకుంటూ, బుధవారం అడ్వొకేట్ జనరల్ ఈ రెండింటిని అధికరణ 207 కింద సాధారణ బిల్లులుగా చెప్పారన్నారు. భాన్ వాదనను ధర్మాసనం ఖండిస్తూ.. సాధారణ బిల్లులని మాత్రమే ఏజీ చెప్పారని, అధికరణ 207 కింద బిల్లులని చెప్పలేదని స్పష్టం చేసింది. వ్యాజ్యాలు తేలేంత వరకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా ఆదేశాలు జారీ చేయాలని అశోక్‌భాన్ కోరారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే.. ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ప్రభుత్వానికి తెలుసునని ధర్మాసనం పేర్కొంది. -
వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజకీయ క్రీడలో పెద్దల సభ ప్రతిష్ట మసకబారిందా? గీత దాటి గౌరవాన్ని కోల్పోయిందా? అనే ప్రశ్నలకు మేధావుల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలి వైఖరి నేపథ్యంలో విన్పిస్తున్న వాదనలివి. ప్రజల ద్వారా ఏర్పడిన అసెంబ్లీ పంపిన బిల్లులకు మండలి సవరణలతో సరిపెడితే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెలెక్ట్ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పిన మండలి చైర్మన్, విచక్షణాధికారం వాడుకున్నానని చెప్పడంతో కౌన్సిల్ పరువు గంగపాలయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ఎజెండాకు తామెందుకు సహకరించాలని మండలి సభ్యులే ప్రశ్నిస్తున్నారు. ఏం చేసినా సర్వాధికారం శాసనసభకే ఉన్నప్పుడు అనవసరంగా శాసనమండలి రాజకీయ వివాదాలకు వేదికవ్వడాన్ని బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలూ వ్యతిరేకిస్తున్నారు. సెలెక్ట్ కమిటీకి పంపే విధానం సరైంది కాదంటూనే.. విచక్షణాధికారం తప్పలేదని మండలి చైర్మన్ చెప్పడం అన్ని వర్గాల్లోనూ చర్చకు ఆస్కారమిచ్చింది. ‘సలహాలు సూచనలు ఇవ్వొచ్చు... లేదంటే తిరస్కరించవచ్చు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలకు పెద్దల సభ వేదిక కాకూడదు’ అని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. ఎవరి కోసం ఈ వివాదం? అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడానికి మండలి చైర్మన్‌నే రాజకీయ ఉచ్చులోకి దించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆయనను ప్రభావితం చేయడం ఓ సమస్య అయితే.. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే మండలి లక్ష్యమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘శాసన మండలి రాజకీయంగా నడుస్తోందన్న సంకేతాలిచ్చినట్లయింది. నిబంధనల ప్రకారం వెళ్లాలని సూచించాం. కానీ ఇక్కడ రూల్స్ అతిక్రమించామని చైర్మనే అంటున్నారు. ఇవి మంచి సంకేతాలా?’ అని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ ఇష్టపడని ఇంగ్లిష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లులూ గతంలో సభకొచ్చాయి. వాటికి సవరణలు చేస్తూ పంపారు. పరోక్షంగా వీటిని టీడీపీ తిరస్కరించినా.. ఇబ్బంది లేకుండా అభిప్రాయం చెప్పగలిగారని మరో ఎమ్మెల్సీ అన్నారు. సీఆర్డీఏ, అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలోనూ ఇదే చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. రాజకీయంగా పంతం నెగ్గించుకోవడమే అంతిమ ధ్యేయంగా మండలి పరువును టీడీపీ బజారుకీడ్చిందని ఆయన అన్నారు. సభలో బలముందని ఇలా వ్యవహరించడం వల్ల రాజ్యాంగ బద్ధమైన వేదిక విలువ పడిపోతుందని మండలిలో బీజేపీ పక్ష నేత మాధవ్ ఆక్షేపించారు. ఇంత చేసినా బిల్లును ఆపగలరా? కీలకమైన బిల్లులను రాజకీయ ప్రయోజనాలతో అడ్డుకోవడంతో ఇప్పుడు శాసనమండలి అందరి నోళ్లలో నానుతోందని, ఇది మంచి పరిణామం కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ‘అసలు మండలి చైర్మన్ విచక్షణాధికారంపై చర్చ జరగాల్సిందే’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన తీరును ఆయన తప్పుబట్టారు. పెద్దల సభ లోతైన విశ్లేషణతో మంచి సలహాలిచ్చే వేదికన్న భావన ఇప్పటి వరకూ ఉందని, ఇప్పుడు అదో రాజకీయ కుట్రలకు వేదికగా మారిందని మరో రాజకీయ విశ్లేషకుడు అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపి చెడ్డపేరు తెచ్చుకోవడం మినహా బిల్లును ఆపగలిగే శక్తి మండలికి ఉంటుందా? అలాంటప్పుడు ఈ యాగీ ఎందుకని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘జాప్యం చేయవచ్చేమోగానీ.. ఆపలేనప్పుడు అనవసరంగా వివాదం కావడమేనన్న భావన న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ మాటల్లో వ్యక్తమైంది. ఏదేమైనా బిల్లులపై మండలి తీరు విస్తృత చర్చనీయాంశమవ్వడం మండలి సభ్యులకు చిన్నతనంగా అన్పిస్తోంది. విశ్వసనీయతకు సవాల్ ఏ సభ అయినా ప్రజాభిప్రాయానికే విలువివ్వాల్సి ఉంటుంది. కానీ మండలి దారి తప్పడం రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందనే వాదన గట్టిగా విన్పిస్తోంది. వివాదాస్పదమైన బిల్లుల విషయంలో మండలి చైర్మన్‌కు సభ్యులు అవసరమైన సలహాలిచ్చారు. కానీ విపక్ష టీడీపీ ఒత్తిడే ఆయనపై పని చేయడంతో నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఇది మండలి విలువను దిగజార్చడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘మండలి చైర్మన్ వివాదంలోకి వెళ్లడమేంటి? ఆయన నిర్ణయం రాజకీయ ప్రయోజనం కావడం ఏంటి?’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. సీనియర్ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ ఈ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘చంద్రబాబు కుట్రలో భాగమై.. మండలి చైర్మన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోయారు’ అని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని ఇలా దొడ్డిదారిన అడ్డుకోవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. -
సీఆర్డీఏ రద్దుపై విచారణ అవసరం లేదు: హైకోర్టు
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ వాదననను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. సంబంధిత బిల్లులపై చట్టసభల్లో ఇంకా చర్చ కొనసాగుతున్నందున ప్రస్తుతం విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. అలాగే ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. మూడు రాజధానుల బిల్లు మనీ బిల్లుగా పిటిషనర్ తరఫు న్యాయవాది అశోక్ బయల్ వాదనలు వినిపించారు. మనీ బిల్ కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. బిల్లు ఏ దశలో ఉందని న్యాయమూర్తి అడగ్గా.. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం జరిగిందని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి ఈ సమయంలో విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కార్యాలయాల తరలింపుకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇస్తోందని, దాన్ని ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ తరపు న్యాయవాది అశోక్ బయల్ కోరారు. ప్రభుత్వం అలా చేసినట్టు నిరూపిస్తే దానికి ప్రభుత్వాన్ని, సంబంధించిన అధికారులను బాద్యులను చేస్తామని కోర్టు తెలిపింది. ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, కేశినేని నాని కోర్టుకు హాలుకు వచ్చి వాదనలు ఆలకించారు. (ముందు మండలి నిర్ణయం రానివ్వండి) -
ముందు మండలి నిర్ణయం రానివ్వండి
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలి నిర్ణయం తీసుకున్న తరువాత రాజధాని, హైకోర్టు తరలింపు వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదనలు వినిపిస్తూ ద్రవ్య బిల్లు రూపంలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రభుత్వం తెచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సమాధానమిస్తూ అవి ద్రవ్య బిల్లులు కావని తెలిపారు. సాధారణ బిల్లులుగానే వాటిని ప్రభుత్వం శాసన మండలిలో ప్రవేశపెట్టిందని, వాటిపై చర్చ జరుగుతోందని నివేదించారు. దీనిపై అశోక్ భాన్ జోక్యం చేసుకుంటూ ద్రవ్యబిల్లులు కాదంటూ ఏజీ చేసిన ప్రకటనను నమోదు చేయాలని కోరగా అవసరమైనప్పుడు నమోదు చేస్తామని ధర్మాసనం పేర్కొంది. బిల్లులు ఇంకా చట్ట రూపం దాల్చలేదని, ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏదీ కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. మీకెందుకు అంత తొందర? ముఖ్యమంత్రి బుల్ ఇన్ చైనా షాప్ (సున్నితత్వం, జాగ్రత్త అవసరమైన పరిస్థితుల్లో ఉద్రేకంగా, విపరీతంగా వ్యవహరించడం)లా వ్యవహరిస్తున్నారని ఈ సమయంలో అశోక్‌భాన్ వ్యాఖ్యలు చేయడం పట్ల ఏజీ శ్రీరామ్ తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రిని ఈ విధంగా అవమానించే రీతిలో మాట్లాడటం తగదని, పిటిషన్లలో లేని విషయాల గురించి ఇలా మాట్లాడటం సబబు కాదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... వాళ్లు చెప్పేది చెప్పనివ్వండి. వాళ్లు చెప్పేవన్నీ మేమేం రికార్డు చేయడం లేదు కదా. మీరు చెప్పాల్సిన సమయంలో మీరూ చెప్పండి అంటూ ఏజీని కూర్చోబెట్టింది. అశోక్‌భాన్ తన వాదనలను కొనసాగిస్తూ వికేంద్రీకరణ పార్లమెంట్, రాష్ట్రపతి స్థాయిలో జరగాల్సిన నిర్ణయమని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బిల్లులపై మండలిలో చర్చ జరుగుతోంది కదా. మీకెందుకు అంత తొందర? మండలిని నిర్ణయం తీసుకోనివ్వండి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుంటే జోక్యం చేసుకుని స్టే ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉందని అశోక్‌భాన్ పేర్కొనటంపై ధర్మాసనం స్పందిస్తూ తాము ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడే చేస్తామని తేల్చి చెప్పింది. ఒకరోజు ఆగితే స్పష్టత వస్తుందని, రెండు బిల్లులపై మండలి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ వ్యాజ్యాలపై విచారణ జరుపుతామని తెలిపారు. ఇకపై ఈ వ్యాజ్యాలపై ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతుందని సీజే జస్టిస్ మహేశ్వరి పేర్కొన్నారు. -
ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’
రాష్ట్రీయం చట్టంగా సీఆర్డీఏ బిల్లు: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లు 2014, డిసెంబర్ 30న చట్టంగా రూపొందింది. ఈ చట్టం ప్రకారం మొత్తం రాజధాని పరిధి 7,068 చదరపు కిలోమీటర్లు కాగా రాజధాని నగర పరిధి 122 చదరపు కిలోమీటర్లు. ప్రభుత్వం సీఆర్డీఏకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఈ - వైద్య పీహెచ్సీ: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విజయవాడలోని పటమట అంబేద్కర్‌నగర్‌లో ఈ-వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ జనవరి 4న ప్రారంభించారు. ఈ కేంద్రంలో టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలు అందిస్తారు. 12వ స్థానంలో తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా, భౌగోళిక పరంగా దేశంలో 12వ స్థానంలో ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ రూపొందించిన ‘తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్-2015’ పుస్తకంలో స్పష్టం చేసింది. ఈ పుస్తకాన్ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ డిసెంబర్ 31న సచివాలయంలో ఆవిష్కరించారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం 1,14,840 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ‘సింగరేణి’ సీఎండీగా శ్రీధర్: సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి నడిమట్ల శ్రీధర్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసింది. ఆర్థికసంఘం చైర్మన్‌గా కాంతారావు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగో ఆర్థిక సంఘాన్ని జనవరి 5న ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎంఎల్ కాంతారావు, సభ్య కార్యదర్శిగా రిటైర్డు పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సి.వెంకటేశ్వరరావును నియమించింది. అమృతహస్తం.. ఇక ఆరోగ్యలక్ష్మి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి అందిస్తున్నట్లు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘‘ఆరోగ్యలక్ష్మి’’గా నామకరణం చేశామని.. దీని ద్వారా గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారాన్ని అందుకోవాలని అధికారిక ప్రకటనలో కోరారు. క్రీడలు సంగక్కర ఖాతాలో 12 వేల పరుగులు శ్రీలంక క్రికెటర్ కుమార్ సంగక్కర టెస్టు కెరీర్లో 12 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఐదో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్లో జనవరి 3న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని స్క్వేర్ దిశగా మళ్లించి రెండు పరుగులు తీయడం ద్వారా ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గతంలో ఈ రికార్డు సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్ (15,921), రికీ పాంటింగ్ (13,378), జాక్వెస్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288) ఉన్నారు. భారత్‌కు 14 పతకాలు ఆసియా యూత్, జూనియర్ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆరు స్వర్ణాలు, నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి 14 పతకాలు సాధించింది. భారత్ నుంచి మొత్తం 20 మంది బరిలోకి దిగగా... 14 మంది పతకాలు నెగ్గారు. మిగతా ఆరుగురు టాప్-6లో నిలిచారు. జాతీయం కొలీజియం స్థానంలో ఎన్‌జేఏసీ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుకు సంబంధించి 121వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014, డిసెంబర్ 31న ఆమోదం తెలిపారు. దీంతో 1993లో ఏర్పడిన న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే నియమించుకునే కొలీజియం వ్యవస్థ స్థానంలో ఎన్‌జేఏసీ ఏర్పాటవుతుంది. రాజ్యాంగ ప్రతిపత్తి గల ఈ కమిషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలూ కమిషన్ ద్వారా జరుగుతాయి. ఐఆర్డీఏ పేరు మార్పు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) పేరును భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ ఆఫ్ ఇండియా)గా పేరు మార్చారు. దీనికి సంబంధించి సంస్థ 2014, డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించింది. మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’ మహిళల భద్రతకు ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 1న ఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ హిమ్మత్‌ను రూపొందించారు. అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తులను చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను కేంద్రం తీసుకొచ్చింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(ఎన్ఐటీఐ)’ పేరుతో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ఇకపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాలను రూపొందించే మేధో సంస్థగా సేవలందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తారు. ఈ మేరకు జనవరి1న కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా ఆర్థికవేత్త అరవింద్ పనగరియా(62) నియమితులయ్యారు. మరో ఆరుగురు సభ్యులను, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను కూడా ప్రభుత్వం జనవరి 5న నియమించింది. ఉగ్రవాదుల పడవను అడ్డుకున్న భారత తీర రక్షక దళాలు అరేబియా సముద్ర జలాల మీదుగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదులను భారత తీర రక్షక దళాలు అడ్డుకున్నాయి. ముంబై 26/11 తరహా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు భావిస్తున్నారు. 2014, డిసెంబర్ 31న గుజరాత్‌లోని పోర్బందర్ తీరానికి 365 కి.మీ. దూరంలో భారత తీర రక్షక దళాలు పడవను గుర్తించాయి. తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఉగ్రవాదులు పడవను పేల్చేశారు. పుణెలో బ్యాంకుల ‘జ్ఞాన సంగమ్’ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్న ‘జ్ఞాన సంగమ్’ సమావేశం జన వరి 3న ముగిసింది. కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభు త్వ రంగ బ్యాంకులను పటిష్టం చేసేందుకు సాహసోపేత సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ముంబైలో 102వ సైన్స్ కాంగ్రెస్ ముంబైలోని ముంబై యూనివర్సిటీలో 102వ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు. ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ హ్యుమన్ డెవలప్మెంట్ (మానవ అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ)’పై సదస్సు అయిదు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో 12 వేల మంది దేశ, విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. వివిధ అంశాలపై విస్తృత చర్చలు, పరిశోధన పత్రాలను సమర్పించారు. మళ్లీ రూపాయి నోటు ముద్రణ కేంద్ర ప్రభుత్వం రూపాయి నోటు ముద్రణను జనవరి 1 నుంచి తిరిగి ప్రారంభించింది. ఇది మరో రెండు నెలల్లో చెలామణిలోకి రానుంది. ఆర్థిక కార్యదర్శి సంతకంతో రూపాయి నోట్లను ముద్రిస్తారు. ప్రభుత్వం 1994 నవంబరులో రూపాయి నోటు ముద్రణను నిలిపేసింది. ఎల్ఈడీ బల్బుల పంపిణీ పథకం ప్రారంభం గృహ సామర్థ్య విద్యుత్ కార్యక్రమం(డీఈఎల్పీ) కింద కరెంటును ఆదాచేసే ఎల్ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రధాని నరే ంద్ర మోదీ జనవరి 5న ఢిల్లీలో ప్రారంభించారు. సౌత్‌బ్లాక్‌లో ఓ సాధారణ బల్బును తొలగించి ఎల్ఈడీ బల్బును అమర్చారు. ఎల్ఈడీ బల్బు ‘ప్రకాశ్ పథ్’(వెలుగు బాట) అని వ్యాఖ్యానించారు. వార్తల్లో వ్యక్తులు శాఖాహార ప్రముఖులుగా మోదీ, రేఖ జంతు హక్కుల సంస్థ పెటా-ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, సినీ నటి రేఖలను హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీలుగా ఎంపిక చేసింది. వేలాది మంది ఓటింగ్ ద్వారా వీరిని ఎంపిక చేసినట్లు డిసెంబర్ 30న ప్రకటించింది. ఎప్పుడూ లేని విధంగా 2014లో మోదీ, రేఖల వల్ల శాఖాహారానికి మంచి ప్రచారం లభించినట్లు తెలిపింది. రైల్వే బోర్డు చైర్మన్‌గా ఏకే మిట్టల్ రేల్వే బోర్డు కొత్త చైర్మన్‌గా ఏకే మిట్టల్ 2014, డిసెంబర్ 31న నియమితులయ్యారు. అరుణేంద్ర కుమార్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. మిట్టల్ రైల్వే బోర్డులో మెంబర్ స్టాఫ్‌గా విధులు నిర్వహించారు. ఇస్రో తాత్కాలిక చైర్మన్‌గా శైలేశ్ నాయక్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ రాధాకృష్ణన్ పదవీకాలం 2014, డిసెంబర్ 31తో ముగిసింది. ఆయన స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా శైలేశ్ నాయక్‌ను నియమించారు. ఈయన బెంగళూరులోని ఎర్త్ అండ్ సైన్స్ విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఐఎన్ఎస్ అధ్యక్షునిగా కిరణ్ బీ వదోదరియా ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) నూతన అధ్యక్షునిగా గుజరాతీ పత్రిక సంభావ్ మెట్రోకు చెందిన కిరణ్ బీ వదోదరియా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఐఎన్ఎస్ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2014-15 సంవత్సరానికి ఆయన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ద స్టేట్స్‌మన్ పత్రికకు చెందిన రవీంద్రకుమార్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. గృహలక్ష్మి పత్రికకు చెందిన పీవీ చంద్రన్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా.. రాష్ట్రదూత్కు చెందిన సోమేశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ప్రముఖ పాత్రికేయుడు వర్గీస్ కన్నుమూత ప్రముఖ జర్నలిస్టు, మెగసెసే అవార్డు గ్రహీత బీజీ వర్గీస్ (87) 2014, డిసెంబర్ 30న గుర్గావ్లో అస్వస్థతతో మరణించారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘హిందూస్థాన్ టైమ్స్’ ఆంగ్ల పత్రికల ఎడిటర్‌గా ఆయన పనిచేశారు. డీజీసీఏ సారథిగా సత్యవతి బాధ్యతలు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త చీఫ్‌గా ఎం.సత్యవతి జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. డీజీసీఏ అధిపతిగా ఒక మహిళ నియమితులు కావడం ఇదే ప్రథమం. ప్రభాత్ కుమార్ స్థానంలో వచ్చిన 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమె మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఈ పదవికి ముందు ఆమె పౌర విమానయాన శాఖకు అదనపు కార్యదర్శిగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా ఒబామా భారత్ రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన పర్యటనను వైట్‌హౌజ్ జనవరి 5న ఖరారు చేసింది. భారత గణతంత్ర దినోత్సవానికి హాజరుకానున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే కావడం గమనార్హం. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మోదీ-ఒబామా చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయం వీగిన పాలస్తీనా తీర్మానం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదం లభించలేదు. 2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది. 2014, డిసెంబర్ 31న మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 8 దేశాలు మద్దతు పలికాయి. మరో తొమ్మిది దేశాలు వ్యతిరేకించాయి. మండలి వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలు వ్యతిరేకించకపోతే.. తీర్మానం ఆమోదం పొందడానికి 9 దేశాల మద్దతు అవసరం. కానీ అమెరికా, ఆస్ట్రేలియాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు ఉత్తర కొరియాపై అమెరికా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించింది. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థపై సైబర్ దాడులకు ఉత్తర కొరియా ప్రభుత్వ మద్దతు ఉందని అమెరికా తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఇలాం టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున ఉత్తర కొరియాకు చెందిన మూడు సంస్థలు, పదిమంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. మీథేన్ వాయువుతో కరెంటు బొగ్గు గనుల నుంచి భారీగా విడుదలయ్యే మీథేన్ వాయువును విద్యుత్‌గా మార్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్‌ను చైనా నిర్మించింది. ప్రపంచంలోనే ఇలాంటి భారీ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్స్‌లో లుయాన్ గ్రూప్ దీన్ని ఏర్పాటుచేసింది. గనుల నుంచి విడుదలయ్యే 99 శాతం మీథేన్‌తో 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కంపెనీ తెలిపింది. -
సీఆర్డీఏ బిల్లులోని ప్రధాన అంశాలు
హైదరాబాద్: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు శాసనసభలో కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లును ప్రవేశపెట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాలలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. 17 చాప్టర్లు, 117 పేజీలతో సీఆర్డీఏ బిల్లును రూపొందించారు. 12,050 కోట్ల రూపాయలతో మూల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ప్రాధమికంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. సీఆర్డీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. 77 కిలోమీటర్ల పరిధిలోని రాజధానిపై పూర్తి అధికారాలు సీఆర్డీఏకే చెందుతాయి. పరిపాలనా బాధ్యతలు, పర్యవేక్షణకు స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తారు. ల్యాండ్ పూలింగ్ బాధ్యతను కూడా సీఆర్డీఏకే అప్పగించారు. ప్రధానంగా రాజధాని డెవలప్మెంట్ ప్లాన్, రాజధాని ప్రాంతపరిధిలోకి వచ్చే గ్రామాలు బిల్లులో వివరించారు. రాజధాని ప్రాంత భవిష్యత్ కోసం ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. మూడు దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందిన తరువాత గవర్నర్ దగ్గరకు వెళ్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గవర్నర్ ఆమోదం పొందిన తరువాత భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. భూసేకరణ సమయంలో భూములు ఇస్తున్నట్లు రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుంటామన్నారు. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) పరిధిలోని ఆస్తులు, అప్పులు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్ణయం వచ్చే ఏడాది మార్చిలోపు తెలుస్తుందని యనమల తెలిపారు.