సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రాంతీయ సమానాభివృద్ధి దిశగా పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి శుక్రవారం కీలక ముందడుగు పడింది. సీఆర్‌డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులను పరిశీలించి.. న్యాయ నిపుణులతో చర్చించి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఈ మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అమరావతిలో శాసన రాజధాని.. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని... కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
అయితే ఎప్పటిలాగే ప్రతీ అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని తప్పుబట్టడంతో పాటుగా.. గవర్నర్ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగానికి, విభజన చట్టానికి ఇది వ్యతిరేకమంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో చంద్రబాబు గతంలో అనుసరించిన తీరు, విభజన చట్టం అమలులో గత ప్రభుత్వ వైఖరి, రాజ్యంగంలో ఉన్న విషయాల గురించి మేధావులు, న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్న కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం.(3 రాజధానులకు రాజముద్ర)
హడావుడిగా పరిగెత్తుకు వచ్చారు
కేంద్రం చేసిన చట్టం 6/2014 కి విరుద్ధమని కొంత మంది అంటున్నారు. అందులో ఒక రాజధాని అని ఉంటే.. ఇప్పుడు మూడు రాజధానులు అనడమేంటని వాదిస్తున్నారు. ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలని, అటార్నీ జనరల్ సలహా కోసం పంపించాల్సి ఉంటుందని ఇంకో వాదన చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ రాజకీయ దురుద్దేశంతో ఉందని మరి కొంతమంది అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇలాంటి తరుణంలో సెంట్రల్ యాక్టు 6/2014 అంటే విభజన చట్టంలో ఏమి రాసుందో మేధావులు పరిశీలించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సెక్షన్ 5, సెక్షన్ 6 గురించి చెప్పాల్సివస్తే... సెక్షన్ 5 లో యధాతథస్ధితిని విధిస్తూ హైదరాబాద్‌ని పదేళ్లు ఉమ్మడి క్యాపిటల్‌గా ఉంచుదామని అనుకున్న తర్వాత, ఆ విధానాన్ని చంద్రబాబు మట్టికరిపించారు. స్వప్రయోజనాల కోసం పదేళ్లు ఆగకుండా క్యాపిటల్ కట్టకుండానే ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చిన పరిస్థితులు చూశాం. అంటే విధానపరంగా తీసుకున్న నిర్ణయాలను విభేదించిన తీరును గమనించవచ్చు. (శివరామకృష్ణన్, జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు చెప్పిందిదే..)
ఆనాడు సహకరించలేదు.. అది చట్టవిరుద్ధం కాదా?
ఇక మరో అంశం.. ‘‘మీ కంటూ ఒక కేపిటల్ ఉండాలి, ఉంటుంది’’ అని చెప్పడం సెక్షన్ 5 అభిప్రాయం. ఆ సెక్షన్ 5ను అనుసరించి.. రాజధాని ఎక్కడ ఉండాలనేదానిపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడానికి.. సెక్షన్ 6 లో శివరామకృష్ణన్ కమిటీ గురించి ప్రస్తావించి మార్చి, 2019లో అంటే బిల్లు వచ్చిన మూడు వారాలకే ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి అప్పటి ప్రభుత్వం చూపించిన విధేయత గురించి పెద్దగా చెప్పుకోనక్కరలేదు, ఆ కమిటీ ఎలా చేద్దాం, ఏం చేద్దాం మీరు సమాచారం ఇవ్వండని ప్రభుత్వాన్ని కోరితే.. ఇవ్వని పరిస్థితి. ప్రభుత్వం తమకు సహకరించలేదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అంటే రాజ్యాంగం, సెంట్రల్ చట్టం అని పదే, పదే అని గుండెలు చించుకుని అరిచేవాళ్లు ఆ రాజ్యాంగ పూరితమైన చట్టం కింద అపాయింట్ అయిన కమిటీకి సహకరించలేదని స్పష్టమవుతోంది.
అంతేకాదు వీళ్లు రాజకీయ దురుద్దేశంతో రాజధాని ఎక్కడ నిర్మించాలన్న అంశం మీద ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఆ కమిటీ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటే, దాన్ని బేఖాతరు చేసి, ఒక లొకేషన్‌ని డిసైడ్ చేసేసుకుని ఆ విషయాన్ని ఎక్కడా, ఎవరికీ బయటపడకుండా.. కేవలం వాళ్ల బంధు, మిత్ర పరివారానికి మాత్రం చెప్పుకున్నారు. రాజధాని నిర్మాణ అంశాన్ని సొమ్ము చేసుకునేలా ఒక ప్రణాళిక రచించి. నారాయణ కమిటీ అని తూతూ మంత్రంగా ఓ కమిటీ వేశారు. నిజానికి ఆ కమిటీ ఎందుకు వేశారు? సెంట్రల్ యాక్ట్‌కు అది విరుద్ధం కాదా? న్యాయకోవిదులు ఆ రోజు అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఇదంతా ఒక ప్రణాళిక బద్ధంగా దేశంలో ఉన్న సంపదను ఒక వర్గానికో, వారి అస్మదీయులకో, వారి అనునాయులకో ఇద్దామన్న ఒక ప్రణాళికే తప్ప దీంతో ఉపయోగం లేదన్న వారి మాటలను గమనించాలి.(మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..)
బంధువులకు దోచిపెట్టడం రాజ్యాంగబద్ధమా?
ఇక మూడు రాజధానులు ఎందుకు అన్న వారు ఒకసారి చట్టం పూర్తిగా చదవాలి. సెక్షన్ 5 లో క్యాపిటల్ అని ఉంది. సెక్షన్ 7 గమనించండి. రాజ్యాంగంలో కేపిటల్‌లో ఏముండాలి, ఎక్కడుండాలి అనేది ఏమీ లేదు. ప్రజా పాలన కోసం, సౌలభ్యం కోసం, ప్రజల అభీష్టం కోసం, ప్రజల సౌకర్యం కోసం పనిచేసే వ్యవస్థలు..., ఒక దగ్గర హైకోర్టు, ఒక దగ్గర లెజిస్లేచర్, ఒక దగ్గర వేరే విషయాలు ఉండటం అనేది ఈ దేశంలో మన రాష్ట్రంలో మొదటిసారి కాదన్నది గమనించాలి. కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఇలాంటి ఉదంతాలు జరగలేదా? అలహాబాద్‌లో యూపీ హైకోర్టు లేదా? అంటే కేపిటల్ అంటే ఈ మూడూ ఒకే చోట అని చంద్రబాబు రాజ్యాంగంలో రాశారా? మీరు దురుద్దేశంతో తీసుకున్న అన్ని నిర్ణయాలను మేం పాటించకపోతే మేం అప్రజాస్వామ్యికంగా పాలించినట్టా?
మీ బంధుమిత్ర పరివారానికి దోచిపెట్టడం రాజ్యాంగబద్ధమా?
చట్టం ఏం చెప్తుందో ఓసారి గమనిస్తే మంచింది. ఏదైనా ఒక ప్రభుత్వం పూర్వాపరాలు ఆలోచించకుండా, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో, ఒక స్వలాభప్రేరితమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను ప్రజాప్రయోజనాల మేరకు తిరగదోడటం అన్నది రాజ్యాంగంలో, కోర్టులు అనుమతించిన పరిధిలో ఉన్న ఒక విధానం. ఇక్కడ రాజధాని నిర్మాణానికి మన దగ్గర వనరులు లేవు, అది మీరు ఒప్పుకుంటున్నారు. కానీ రాజధాని విషయంలో జరిగిన మోసాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు.
ఊక దంపుడు ప్రసంగాలెందుకు?
అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంపై విచారణ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు(ప్రైమాఫేస్ మెటీరియల్) పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చేసింది. బినామీలు ఎక్కడెక్కడ కొన్నారు? ఎవరెవరి పేర్లుతో కొన్నారు? ఎవరెవరు ఏయే నిర్ణయాలు తీసుకున్నారు? వాటిని అనుసరించి ఎవరెవరు ఏం చేశారన్నది పబ్లిక్ డొమైన్‌లో ఉంది! చట్టం బ్యాక్ గ్రాండ్‌తో ఫార్మర్స్‌కి రాశారని చెప్పారు. ప్రామిసరీ ఎస్టపుల్, లెజిటమేట్ ఎక్సెపెక్టేషన్ అన్నది ఎన్‌ఫోర్సబుల్ రైట్ కాదు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే, ప్రజా ప్రయోజనాల మేరకు దాన్ని అధిగమించే పవర్ గవర్నమెంట్‌కి లెజిస్లేషన్‌కి, ఎగ్జిక్యూటివ్ డెసిషెన్స్‌కిన్నూ, ప్రామిసరీ ఎస్టపుల్‌న్నూ, లెజిటమేట్ ఎక్సెపెక్టేషన్సూ అఫ్లై కాదని చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇవన్నీ చదవకుండా ఊక దంపుడు కొడతామంటే ఎలా...?
ధర్మాసనాలు ఏం చెప్పాయంటే... ఒకరికి ఇచ్చిన ప్రామిస్, ఒకరికి ఇచ్చిన క్రియేట్ చేసిన ఒక కాండక్ట్ గనుక ప్రజాప్రయోజనాలతో కూడుకున్నదిగా లేదన్న మెటీరియల్‌ను చూపించి, ఇది ఇలా చేయటం కుదరదు, వనరులు లేవు, ఇది దురుద్దేశంతో కూడుకున్నది అని అంటే దాన్ని సరిదిద్దకపోతే తప్పు అవుతుంది. ప్రజాబలంతో ఎన్నుకున్న ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో చేసిన ఆగడాలను తిరగదోడకపోతే అది ప్రజాతీర్పునకు వ్యతిరేకం అవుతుంది. ఎన్నికలకు ముందు మారుస్తామని చెప్పారా అంటున్నారు? గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోతుగా వెళ్తే తెలుస్తాయి ఏ డొంకలు ఎక్కడున్నాయని...? అది చూసిన తర్వాత దీంట్లో ప్రజాప్రయోజనం లేదని చెప్పారు. కొంతమందిపై దీని ప్రభావం ఉన్న మాట వాస్తవం. వారిని ఎలా ఆదుకోవాలనేది ప్రభుత్వ బాధ్యత. ఈ విషయంలో గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. వారిని చూసుకుంటామని భరోసా ఇచ్చింది. ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెబుతోంది. వారు ఆలోచించిన మేరకు బాహుబలిలా కాదు ఎంత కుదురుతుందో అంత చేస్తామని చెబుతోంది.
అదే రోజు చట్టం.. అదే రోజు జీవోలు.. అంటే?
మరో విషయం.. రాజధాని భూముల్లో గతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందా? రాజ్యాంగం, రాజకీయం, చట్టం అని అన్నప్పుడు చట్టం అన్నది ఎలా చేయబడుతుంది, ఎవరి ప్రయోజనాల కోసం చేయబడుతుందని వాళ్లు మాట్లాడినంతగా మనం ఈ చట్టం వెనుక రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి? వాళ్లందరూ కలిసి ఒక కేపిటల్ నిర్దేశించుకున్న తర్వాత సీఆర్డీఏ చట్టం తీసుకు వచ్చారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంటుని మీరు కన్సెల్ట్ చేసిందీ లేదు? శివరామకృష్ణన్ కమిటీ మీతో సంప్రదింపులు జరిపిందీ లేదు. వాళ్లను మీరు ఖాతరు కూడా చేయలేదు? దీన్ని ‘ఫ్రాడ్ ఆన్ పబ్లిక్ పవర్’ అంటారు. 2014,30 డిసెంబరు.. అదే రోజు చట్టం చేస్తారు, అదే రోజు నాలుగు జీవోలు వస్తాయి.
అంటే చట్టం రాకముందే మీరు అడ్మినిస్ట్రేటివ్‌గా క్యాపిటల్ సిటీ అంటే ఎంత ఉండాలి? క్యాపిటల్ రీజియన్ అంటే ఎంత ఉండాలి? దాంట్లో ఎన్నెన్ని మనవాళ్లు బినామీలుగా, ఎక్కడెక్కడ ఎన్ని కొనుక్కోవాలి అన్నది నిర్ధారణ అయిన తర్వాత... ఒక ఫ్రీ డిటర్మంట్ డెసిషన్‌గా.. ఒక చట్టం రూపం దాల్చడానికి పునాది వేశారు. ఏపీ సీఆర్డీయే చట్టం తీసుకువచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంటుకు అనుగుణంగా ఉందా లేక వ్యతిరేకంగా ఉందా లేకపోతే యాక్ట్‌కు ఎలా ఉంది అనుకుంటే దాంట్లో ప్రజాప్రయోజనం ఉంది కాబట్టి దాన్ని మీరు దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారా?
ఇప్పుడు మాత్రం ఎందుకలా?
ఇప్పుడు యమనల రామకృష్ణుడు ప్రెసిడెంటుకి ఆమోదంకోసం వెళ్లాలంటున్నారు. మీరు చట్టం చేసినప్పుడు, మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవసరంలేని రాష్ట్రపతి ఆమోదం, ఇప్పుడు కావాలా? అంటే మీరు చెప్పింది చంద్రన్న రాజ్యాంగమా... ఇది భారత రాజ్యాంగమా.. మీకు అనువైనవన్నీ మీ రాజ్యాంగంలో రాసుకుని, మీ పార్టీ మేనిఫెస్టోని, అసలు రాజ్యాంగాన్ని ఎలా సరిపోల్చి భాష్యాలు చెబుతారు? సీఆర్డీఏ చట్టం చేసేటప్పుడు ప్రెసిడెన్షియల్ ఎసెంట్ రానప్పుడు, మరి దాన్ని తీసేటప్పుడు ఎందుకు కావాలని అదొక సూటిప్రశ్న? వికేంద్రీకరణ అనేది రాజ్యాంగ బద్దం కాదు అన్నవాళ్లు ఒక్కసారి ఆర్టికల్ 38 చదువుకోవాలి. ఈ ఆర్టికల్ ప్రకారం (రాజ్యాన్ని శాసించేదేమిటంటే).. మీరు, మీ పాలనా విధానాలను అందరికీ చేరువలో ఉంచి, అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ, అందరికీ మంచి చేకూరేలా చేయాలన్నది ‘స్టేట్ షెల్ ఎండీవర్’ అన్నారు. ఆ ఆబ్జెటివ్‌ని తీసుకొని రావాలని స్టేట్‌మెంట్ ఆఫ్ అబ్జెక్షన్ రీజన్స్‌లో ఉంది కదా? లోకల్ బాడీస్‌ని క్రియేట్ చేసి, వికేంద్రీకరణ చేయడం అన్నది చాలా ముఖ్యం.
ఇది ఇప్పుడు గవర్నమెంటు తీసుకున్న చర్యల్లో ఒకటి. గ్రామ, వార్డు సచివాలయాల రూపకల్పన జరిగింది అందుకోసమే. కానీ దానిమీద రాద్ధాంతం చేశారు? ఇప్పుడు వార్డు సెక్రటేరియట్స్ ఎలా పనిచేస్తున్నాయన్న విషయాన్ని దేశమంతా కొనియాడుతూ ఉంది. ఈ మోడల్‌ని దేశంలో అన్ని రాష్ట్రాలు చదవాలంటుంది. దీని ప్రకారం.. వికేంద్రీకరణ అన్నది అమరావతిని తీసేయడానికో, ఉంచటానికో కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తితో, చట్టప్రకారం అవలంబించిన ఒక పొలిటికల్ పాలసీ, ఒక అడ్మనిస్ట్రేటివ్ పాలసీ,ఒక ఎగ్జిక్యూటివ్ పాలసీ(ఇన్ ఎకార్డెన్స్ విత్ లా). అది మీకు నచ్చకపోవచ్చు. రాష్ట్రంలోని మొత్తం సంపద, ఆ 33వేల ఎకరాల్లో పెట్టాలన్నది మీ పాలసీ. అది ఎందుకోసం చేశారు? ఎవరి లాభం కోసం చేశారు? ఏ దురుద్దేశంతో చుశారు? సీబిఐకి కేసు వెళ్లింది... కదా వారే చెప్తారు. దీంట్లో ఎవరెవరు భాగస్వాములు, ఎవరు బినామీలు, ఎవరెంతకు కొన్నారన్నది అంతా బయటకు వస్తుంది. గవర్నమెంటు ఆఫ్ ఇండియా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది అంతా పేపర్లలో చదివాం. ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ అయి ఎంక్వైరీలు జరుగుతుంటే తెలుస్తుంది.
చంద్రబాబుకు భయమెందుకు?
రైతుల వెనుక దాచుకుంటారెందుకు? సేవింగ్స్ క్లాజెస్ చూశారా? రైతులను మభ్యపెట్టి లక్షకోట్ల రూపాయలు, లక్షా యాభై వేల కోట్ల రూపాయలు మీరు ఎక్కడనుంచి తెస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా కార్యక్రమాలకు ఫండ్ చేయడం కోసం మనం ఒక పాలసీ పెట్టుకుంటే, దాన్ని మీరెట్లా తూలనాడుతారు? రాష్ట్రం బ్యాంక్‌రప్ట్ అయిందా అని అడుగుతున్నారే, ఈ సీఆర్డీడీయే కేపిటల్ అన్నదే భూములు అమ్ముకుని తద్వారా వచ్చే డబ్బులతో కేపిటల్ కట్టుకుందామని.. ఆ భూములు ఎలా అమ్ముకోవాలన్న దాంట్లో కుంభకోణాలు ఎన్నిఉన్నాయో మనం చూశాం కదా, మనకి తెలిసిన వాళ్లకి రూపాయికి ఎకరా ఇస్తాం. సెంట్రల్ గవర్నమెంటుకి ఎక్కువ రేటులో లీజుకి ఇస్తాం. మనకి కావాల్సిన వాళ్లకి తక్కువ రేటులో లీజులు ఇస్తాం అంతేనా? ఇవన్నీ లెజిస్లేటివ్ రికార్డ్స్‌లో ఉంది. లెజిస్టేషన్స్ ప్రెజెంట్ చేసేటప్పుడు గౌరవనీయులైన స్పీకరు ఒక ఆదేశం ఇచ్చారు. అయ్యా ముఖ్యమంత్రి గారు దీంట్లో అన్నీ సమూలంగా మీరు విచారణ జరిపించండన్నారు. ఎంక్వైరీ చేయండి అనగానే చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అయ్యారు? అయ్యో ఈ ఎంక్వైరీ చేయడానికి మీకు పవరే లేదన్నారు. అసలు ఎంక్వైరీలంటే చంద్రబాబునాయుడుకు భయమెందుకు!?
Comments
Please login to add a commentAdd a comment