![Government Orders Were Issued Notifying AMRDA. - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/2/ap-gove.jpg.webp?itok=YB4CsrSx)
సాక్షి, అమరావతి: ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా నియమితులయ్యారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (3 రాజధానులకు రాజముద్ర)
Comments
Please login to add a commentAdd a comment