
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు రేపటి నుంచి రోజువారీ విచారణ కొనసాగించనున్నట్లు ధర్మాసనం తెలిపింది. మొత్తం 229 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు పేర్కొంది. అందులో భాగంగా మొదట 49 పిటిషన్లను విచారించనున్నారు. మిగిలిన పిటిషన్లను తర్వాత విచారించనున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది.