సాక్షి, విశాఖపట్నం: స్వర్గీయ ఎన్టీఆర్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, పరిపాలన చూసి ఎంతో ఆనందించేవారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన భీమిలి మండలం తిమ్మాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ బతికుంటే చంద్రబాబు నీచ రాజకీయాలు ఎప్పుడో బట్టబయలు అయ్యేవన్నారు. ఏడాది సంక్షేమ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బురద చల్లాలని ప్రయత్నించడం దుర్మార్గమని మంత్రి అవంతి మండిపడ్డారు. (‘అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా’)
విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదు..
అధికారంలో ఉన్న 14 ఏళ్లూ పేదల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మహానాడులో ఆయన ఓటమిపై విశ్లేషించుకుంటే మంచిదని మంత్రి అవంతి హితవు పలికారు. వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ పాలనను విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదన్నారు. మహానాడులో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ఊపిరిగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నిజ స్వరూపం తెలిసే 23 సీట్లకు ప్రజలు పరిమితం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా ఆయన కుట్రలు మాని హుందా రాజకీయాలు చేయాలని..లేకపోతే ప్రజలే రాజకీయ సమాధి చేస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
నీచ రాజకీయాలు అవసరమా.. ‘కన్నా’? )
Comments
Please login to add a commentAdd a comment