
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని.. టీడీపీ నేతలు త్వరలో చేపట్టనున్న జన చైతన్య యాత్రలో వారిని నిలదీయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ నార్త్, కంచరపాలెంలో మూడవ విడత వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తర నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుంటారని తెలిపారు. ఆయన హామీలను కేవలం 8 నెలల్లో అమలు చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. కంటి వెలుగు ద్వారా జిల్లాలో నాలుగు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.(ప్రజల దృష్టి మళ్లించేందుకే.. ఆ యాత్ర)