
మంత్రి అవంతి శ్రీనివాస్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉద్దేశమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పరిపాలన రాజధాని తరలింపు చట్ట ప్రకారమే జరుగుతుందని తెలిపారు.
అదే విధంగా, భవిష్యత్తులో విభజన వాదం తలెత్తకూడదనే ఈ ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment