అందుకే గతంలో కేంద్రం నిధులు ఆపేసింది..! | Minister Avanthi Srinivas Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ

Published Sat, Feb 15 2020 7:47 PM | Last Updated on Sat, Feb 15 2020 8:10 PM

Minister Avanthi Srinivas Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు భూ సేకరణను అడ్డుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో లక్షా 75వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామన్నారు. వైఎస్సార్‌ నవశకంలో 16 రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్‌పీలకు మరో వారం రోజుల్లో జీతాలు చెల్లిస్తామని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. (బాబు బండారం బయటపడటంతో ఎదురుదాడి)

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి అవంతి మండిపడ్డారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తే రూ.2 వేల కోట్లు అవినీతి బయటపడిందన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అవినీతి ప్రధాని మోదీ దృష్టికి కూడా వెళ్లిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు లేవంటునే మరో వైపు దోచుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు,లోకేష్‌ దోపిడీ వల్లే కేంద్రం గతంలో నిధులు ఆపేసిందన్నారు. పక్క రాష్ట్రాల్లో బీజేపీని ఓడించడానికి చంద్రబాబు డబ్బులు పంపారన్నారు. రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలకు చేకూర్చుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు.
(బాబును కాపాడాలనేదే పచ్చపత్రికల తాపత్రయం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement