సాక్షి, విశాఖపట్నం: టూరిజం రంగానికి రీస్టార్ట్ ప్యాకేజీ అందిస్తున్నామని, రూ.200కోట్ల ప్యాకేజీని అతిధ్య రంగానికి కేటాయించాలని నిర్ణయించామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం రాష్ట్ర టూరిజం కొత్త పాలసీని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. కొత్త ప్యాకేజీలో భాగంగా టూరిజంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. మొత్తం రుణాలపై 9శాతం వడ్డీ కాగా, అందులో 4.5శాతం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టె సంస్థలకి త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి అనుమతులు సరళీకరణ చేస్తామన్నారు. చదవండి: 29న మూడో విడత ‘వైఎస్సార్ రైతు భరోసా’
రాష్ట్రంలోని పర్యాటక రంగంలో హోటల్స్ నిర్మాణం కోసం 10 సంస్థలను ఆహ్వానించామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టూరిజం రంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఏపీలోని పర్యాటక స్థలాల విశిష్టతపై రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని తెలిపారు. టూరిజం రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపి౦దని, పర్యాటక రంగంలో ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయిందని అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క టూరిజం ప్రాజెక్ట్ కూడా రాలేదని, గత ప్రభుత్వ పాలసీ కారణముగా ఏ ఒక్క సంస్థ ముందుకు రాలేదని తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆకర్షణీయంగా టూరిజం పాలసీని రూపొందించామని చెప్పారు. బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మారుస్తున్నామని తెలిపారు. షిప్ యజమానితో చర్చలు చివరదశలో ఉన్నాయని, కొలిక్కి రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. కైలాసగిరిపై వాచ్ టవర్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.
70 ఏళ్ల వయసులో చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాబు మనవడికి ఈ బూతులే నేర్పిస్తున్నాడా? అని ప్రశ్నించారు. అమరావతిలో 100 మంది మహిళలను చూసి రెచ్చిపోతావా? అని ధ్వజమెత్తారు. అమరావతిపై రెఫరెండంకి ముందు విశాఖలో ఆ పార్టీ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‌కు ఎన్నికలు కొత్త కాదని, విశాఖ రైల్వే జోన్‌ను బీజేపీ తాత్సరాం చేస్తోందన్నారు. పోలవరంపై నిధులు విషయంలో కూడా బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్హికి బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి సహకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment