సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ ఆటంకాలు సృష్టిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ‘‘టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. అలజడులు సృష్టించాలన్నది చంద్రబాబు కుట్ర. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని’’ మంత్రి అవంతి దుయ్యబట్టారు.
టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిసున్నారు..
కర్నూలు: టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బాబు డైరెక‌్షన్‌లో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని హఫీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు ఫ్రస్టేషన్..
తాడేపల్లి: రాష్ట్రంలో అలజడులకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. అందుకే సీఎంపై తన చెంచాలతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవడంతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పెరిగిపోయిందన్నారు. సీఎంని దూషించిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్నారు.
ఉనికి కోసం టీడీపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
అనంతపురం: టీడీపీ ఉనికి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అయ్యన్నపాత్రుడు, పట్టాభి రెచ్చిపోతున్నారన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు.
టీడీపీ నేతలు విజ్ఞత కోల్పోయారు..
తూర్పుగోదావరి: టీడీపీ నేతలు విజ్ఞత కోల్పోయారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. టీడీపీ నేత పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
బాబులో మార్పు రాలేదు...
కాకినాడ: చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలజడులు సృష్టించడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా.. బాబులో మార్పు రాలేదన్నారు.
టీడీపీ నేత పట్టాభి మాటలు సంస్కారహీనం..
నెల్లూరు: వరుస ఓటములతో చంద్రబాబుకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే సంజీవయ్య మండిపడ్డారు. టీడీపీ నేత పట్టాభి మాటలు సంస్కారహీనమని ధ్వజమెత్తారు. లోకేష్ అసమర్థుడు అనే విషయాన్ని బాబు జీర్ణించుకోలేపోతున్నారు. ఏమీ చేయలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment