
సాక్షి, విశాఖపట్నం: కరోనా కష్ట కాలంలో పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నారన్నారు. పద్మనాభం మండలం విలాస్‌ఖాన్ గ్రామంలో పారిశుధ్య కార్మికులకు మంత్రి అవంతి శ్రీనివాస్ పాదాభివందనం చేశారు.అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న నేపథ్యంలో.. వైద్యులు, పోలీసులతో పాటు పారిశుధ్య కార్మికులు కూడా సైనికుల్లా పనిచేస్తూ ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment