
సాక్షి, విశాఖపట్నం: గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇప్పటివరకు పరిస్థితి 75 శాతం అదుపులోకి వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే 48 గంటలలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఐదు గ్రామాల ప్రజలను ఇళ్లకు పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు తప్ప ప్రతిపక్షాలన్నీ సీఎం వైఎస్ జగన్ కోటి రూపాయలు నష్ట పరిహారం ప్రకటించడం పట్ల హర్షించారని పేర్కొన్నారు.
(చంద్రబాబు బుర్ర పని చేస్తుందా?: బొత్స)
ఇంత పెద్ద విషాద సంఘటనను కూడా చంద్రబాబు తన రాజకీయానికి వాడుకోవడం దిగజారుడు చర్య అని దుయ్యబట్టారు. ఇంత వరకు ఆంధ్రాకు ఎందుకు రాలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన ఆంధ్రాకు ప్రతిపక్ష నాయకుడా.. తెలంగాణాకా అంటూ అవంతి ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి అండగా ఉంటామని.. ప్రజల బాధ్యత తమదేనని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు
(48 గంటల వరకు గ్రామాలకు వెళ్లొద్దు: నీలం సాహ్ని)