
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, దాచుకోవడమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, దాచుకోవడమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదన్నారు. సీఎం జగన్‌కు తన, మన, పార్టీ, కులం తారతమ్యాలు లేవని తెలిపారు.
చంద్రబాబుకు టీడీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా పట్టులేదని.. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి తప్ప మంచి చేద్దామనే ఆలోచన ఉండదని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలు పన్నడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను చెడగొట్టొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు.
చదవండి: విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు
సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్