సాక్షి, విశాఖ : పద్మభూషణ్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలుగు భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సమావేశంలో లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ..కర్ణాటక సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చినవారు తెలుగువారని ప్రశంసించారు. మంగళంపల్లి 400 రచనలు చేశారని పేర్కొన్నారు.
కళాకారులను ఆదుకుంటాం : అవంతి శ్రీనివాస్
తూర్పుగోదావరి జిల్లా మారుమూల ప్రాంతంలో జన్మించిన మంగళంపల్లి ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చరిత్రలో మంగళంపల్లి పేరు నిలిచిపోతుందన్నారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆయన జయంతి వేడుకలను సాధారణంగా నిర్వహిస్తున్నామని దక్షిణాది రాష్ర్టాల్లో సంగీతాన్ని పరిచయం చేసింది మన తెలుగువాళ్లే అని కొనియాడారు. విద్యతో పాటు సంగీతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, కళాకారులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment