Sitara's 11th Birthday Celebrations At Mahesh Babu Foundation - Sakshi
Sakshi News home page

Sitara Birthday: నేడు సితార పుట్టినరోజు.. ఆ పిల్లల కోసం ఏం చేసిందంటే

Published Thu, Jul 20 2023 11:23 AM | Last Updated on Thu, Jul 20 2023 1:38 PM

Sitara 11Th Birthday Celebration In Mahesh Babu Foundation - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార బర్త్‌డే నేడు (జూలై 20). ఈ సందర్భంగా మహేశ్‌ తన కూతురికి సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '11వ పడిలోకి అడుగు పెట్టిన  నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో నువ్వే స్టార్‌వి. నువ్వు ఏదైనా సాధించగలవు. అని మహేష్‌ అన్నారు.

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్  కుమార్తెగానే కాకుండా తను ఇప్పుడు ఒక స్టార్‌గా గుర్తింపు పొందింది. కానీ నేడు తన పుట్టినరోజును ఎంతో  ఆలోచనాత్మకంగా జరుపుకుంది. ఇప్పటికే స్టార్‌గా ఉన్న సితార.. బర్త్‌డేను విలాసవంతమైన సంబరాలకు పోకుండా ఇలా మహేష్‌బాబు ఫౌండేషన్‌లోని యువతులతో చాలా సాధారణంగా సెలబ్రేట్‌ చేసుకుంది. దీంతో సోషల్‌మీడియా నుంచి ఆమెకు చాలా ప్రంశంసలతో పాటు శుభాకాంక్షలు అందుతున్నాయి.

సితార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో, సితార మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులను కలుసుకోవడం, వారితో కేక్ కట్ చేయడం వంటివి ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరికి పింక్ కలర్‌లో ఉన్న సైకిళ్లను సితార బహుమతిగా ఇచ్చింది. వీడియో షేర్‌ చేస్తూ నమ్రత ఇలా తెలిపింది.  'ఇప్పుడు  ఆ చిన్నారులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వారందరికి పాఠశాల కేవలం సైకిల్ దూరంలో ఉంది. నీలో ఆలోచనాత్మకత ,ఇతరులపై ప్రేమను చూపించే పెద్ద హృదయం ఉంది. నీ అద్భుతమైన ప్రయాణంలో ఇలాంటి అర్థవంతమైన జ్ఞాపకాలను మరెన్నో సృష్టించాలని కోరుకుంటున్నాను.' అని సితారకు నమ్రత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

పీఎంజే జ్యువెలరీ యాడ్‌లో సితార నటించగా, అందుకు సంబంధించిన ఫోటోలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ఈ ప్రకటనలో నటించేందుకుగానూ సితార కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఓ ఇంటర్వ్యూలో తన తొలి పారితోషికంపై స్పందించిన సితార. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ను చారిటీకి ఇచ్చానంది సితార. ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఆదర్శనీయంగా నిలిచిన మహేశ్‌బాబు అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement